Anaganaga kathalaa aa ninnagi selaviste

అనగనగ కథలా ఆ నిన్నకి సెలవిస్తే
Work
Year
Language

పల్లవి:

అనగనగా కథలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే

లోకాల చీకటిని తిడుతూనే ఉంటామా
ఒక చిన్న దీపం వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా

అనగనగ కథలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
హేల హేలాలా జాబిలి కంట్లో కన్నీరా
హేల హేలాలా వెన్నెల కురవాలా

చరణం 1:

హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన
పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా

అరె ఈ నేల ఆకాశం ఉందే మనకోసం
వందేళ్ళ సంతోషం అందాం మన సొంతం

ఈ సరదాలు, సంతోషాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం

చరణం 2:

ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా
నా ఎద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు
ఎన్నడు నీడగా వెంట ఉండవా

అరె కలలే నిజమైనాయి కనులే ఒకటై
కలిపేస్తూ నీ చేయి అడుగే చిందెయ్యి

మన స్నేహాలు, సావాసాలు కలకాలం నిలిచే కథ కావాలి

pallavi:

anaganagā kathalā ā ninnagi sĕlaviste
arĕ kanulanu vĕligiṁche pradi udayaṁ manadele

logāla sīgaḍini tiḍudūne uṁṭāmā
ŏga sinna dībaṁ vĕligiṁchugolemā
ā vĕlugulagi tŏli sirunāmā adi ŏgaḍe sirunavvenammā

anaganaga kathalā ā ninnagi sĕlaviste
arĕ kanulanu vĕligiṁche pradi udayaṁ manadele
hela helālā jābili kaṁṭlo kannīrā
hela helālā vĕnnĕla kuravālā

saraṇaṁ 1:

hŏy bādhalo kannule kaṁdinaṁta mātrāna
poyina kālamu pŏṁdalemugā
regina gāyame āranaṁta mātrāna
kālame sāgaga āgibodugā

arĕ ī nela āgāśhaṁ uṁde managosaṁ
vaṁdeḽḽa saṁtoṣhaṁ aṁdāṁ mana sŏṁtaṁ

ī saradālu, saṁtoṣhālu alalayyelā allari seddāṁ

saraṇaṁ 2:

ĕṁdugo emiḍo ĕṁtamaṁdilo unnā
nā ĕda nī jade koruduṁdigā
ŏṁṭari dārilo nāgu toḍuvaināvu
ĕnnaḍu nīḍagā vĕṁṭa uṁḍavā

arĕ kalale nijamaināyi kanule ŏgaḍai
kalibestū nī seyi aḍuge siṁdĕyyi

mana snehālu, sāvāsālu kalagālaṁ nilise katha kāvāli