Amtaa ramdoy ramdi tamdanaalagi

అంతా రండోయ్ రండి తందనాలకి
Year
Language

పల్లవి:

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్ళకి
అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్ళకి
గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళ
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్ళకి

చరణం 1:

కవ్వించిన కాలం కలిసొచ్చిన వైనం
కోలాటం వేస్తూ చేసే కోలాహలాన
కేరింతల మేళం ఎలుగెత్తిన గానం
ఊరంతా హోరెత్తించే ఈ రోజునా
కోదండ రామయ్య కళ్యాణమో
గోపాల కృష్ణయ్య జన్మాష్టమో
అన్ని పండుగలలో - కళలు కలిపి
వెయ్యి వేణువులలో - స్వరములొలికి
సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచెనిదిగో

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్లకి
గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళ
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా

చరణం 2:

ఎన్నో తిరనాళ్ళు తిరిగొచ్చిన వాళ్లు
ఏనాడూ చూసి ఉండరు ఈ సంబరాలు
వెన్నెల కెరటాలు ఎగసే సంద్రాలు
ఆ నింగీ నేలా కలిపే ఈ నవ్వులు
శ్రీవాణి కొలువైన ఈ కోవెల
సింగారమయ్యింది ఇదిగో ఇలా
మదిని మేలుకొలిపే - వెలుగు కొరకు
మనిషి మేలు తెలిపే - తెలివి కొరకు
చదువుల తల్లికి సేవలు చేయగ తగిన తరుణమిదిగో

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్ళకి
గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళ
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా
తాళమే వేయగా శివ తాండవం చెయ్యగా
అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్ళకి

pallavi:

aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽḽagi
aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽḽagi
guṁḍĕ layalo gaṁga alale sĕṁgumanu veḽa
kŏtta śhṛtilo aṣhṭa diśhalu gŏṁtu kalibelā
tagiḍa taga tagiḍa tagiḍa taga
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā

aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽḽagi

saraṇaṁ 1:

kavviṁchina kālaṁ kalisŏchchina vainaṁ
kolāḍaṁ vestū sese kolāhalāna
keriṁtala meḽaṁ ĕlugĕttina gānaṁ
ūraṁtā horĕttiṁche ī rojunā
kodaṁḍa rāmayya kaḽyāṇamo
gobāla kṛṣhṇayya janmāṣhṭamo
anni paṁḍugalalo - kaḽalu kalibi
vĕyyi veṇuvulalo - svaramulŏligi
suṁdara svapnamu kannula muṁdara nilisi pilisĕnidigo

aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽlagi
guṁḍĕ layalo gaṁga alale sĕṁgumanu veḽa
kŏtta śhṛtilo aṣhṭa diśhalu gŏṁtu kalibelā
tagiḍa taga tagiḍa tagiḍa taga
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā

saraṇaṁ 2:

ĕnno tiranāḽḽu tirigŏchchina vāḽlu
enāḍū sūsi uṁḍaru ī saṁbarālu
vĕnnĕla kĕraḍālu ĕgase saṁdrālu
ā niṁgī nelā kalibe ī navvulu
śhrīvāṇi kŏluvaina ī kovĕla
siṁgāramayyiṁdi idigo ilā
madini melugŏlibe - vĕlugu kŏragu
maniṣhi melu tĕlibe - tĕlivi kŏragu
saduvula talligi sevalu seyaga tagina taruṇamidigo

aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽḽagi
guṁḍĕ layalo gaṁga alale sĕṁgumanu veḽa
kŏtta śhṛtilo aṣhṭa diśhalu gŏṁtu kalibelā
tagiḍa taga tagiḍa tagiḍa taga
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā
tāḽame veyagā śhiva tāṁḍavaṁ sĕyyagā
aṁtā raṁḍoy raṁḍi taṁdanālagi
saṁtoṣhāle tĕṁḍi muṁdu nāḽḽagi