Ammaayee kidigee pakkana

అమ్మాయీ కిటికీ పక్కన
Year
Language

పల్లవి:

అమ్మాయీ కిటికీ పక్కన కూర్చుందీ
కిటికీలోంచేం కనపడుతుందీ
గంటకి డెభ్భై మైళ్ళ వేగంతోటి
ఈలోకం పరిగెడుతుందండి

అమ్మాయీ కిటికీ పక్కన కూర్చుందీ
కిటికీలోంచేం కనపడుతుందీ
గంటకి డెభ్భై మైళ్ళ వేగంతోటి
ఈలోకం పరిగెడుతుందండి

చరణం 1:

అక్కడ చూడు తాడి చెట్టుందీ
ఆకులు ఊపీ టాటా చెబుతుందీ
జాబిలి ఎందుకు వెంటే వస్తుందీ
నీ పైన మనసయ్యుంటుంది

పైకి కిందకి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటే నీ ఊయలనౌతానందీ
మీదకి వచ్చే గాలేమనుకుంటుందీ
నీ ఊసులు మొయ్యాలంటుంది
ఒహొహొహో ఒహోహోహో
ఒహోహొహోహోహోహో

అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుందీ
గుమ్మంలోంచేం కనపడుతుంది
గంటకి ఎనభై మైళ్ళ వేగంతోటీ
ఏవేవో ఆలోచిస్తుంది

చరణం 2:

ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటివరకు ఎరగని సంతోషాన్నీ
ఇట్టే నా ముందర ఉంచింది

చల్లని చీకటి చుట్టూ కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకు ఆ చీకటి కరిగిందీ
నిద్దురలోనే కవ్వించే కలకన్నా
నిజమెంతో అందంగా ఉందీ
ఒహొహొహో ఒహోహోహో

అమ్మాయి కిటికీ పక్కన పడుకుందీ
కిటికీలోంచేం కనపడుతుంది
గంటకి తొంభై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది

pallavi:

ammāyī kiḍigī pakkana kūrsuṁdī
kiḍigīloṁcheṁ kanabaḍuduṁdī
gaṁṭagi ḍĕbhbhai maiḽḽa vegaṁtoḍi
īlogaṁ parigĕḍuduṁdaṁḍi

ammāyī kiḍigī pakkana kūrsuṁdī
kiḍigīloṁcheṁ kanabaḍuduṁdī
gaṁṭagi ḍĕbhbhai maiḽḽa vegaṁtoḍi
īlogaṁ parigĕḍuduṁdaṁḍi

saraṇaṁ 1:

akkaḍa sūḍu tāḍi sĕṭṭuṁdī
āgulu ūbī ṭāḍā sĕbuduṁdī
jābili ĕṁdugu vĕṁṭe vastuṁdī
nī paina manasayyuṁṭuṁdi

paigi kiṁdagi ūge nela emaṁdi
nuvvu ū aṁṭe nī ūyalanaudānaṁdī
mīdagi vachche gālemanuguṁṭuṁdī
nī ūsulu mŏyyālaṁṭuṁdi
ŏhŏhŏho ŏhohoho
ŏhohŏhohohoho

ammāyi gummaṁ daggara nuṁchuṁdī
gummaṁloṁcheṁ kanabaḍuduṁdi
gaṁṭagi ĕnabhai maiḽḽa vegaṁtoḍī
evevo ālosistuṁdi

saraṇaṁ 2:

ūhiṁchani majilī vachchiṁdi
nālo ūhalni malubulu tippiṁdi
ippaḍivaragu ĕragani saṁtoṣhānnī
iṭṭe nā muṁdara uṁchiṁdi

sallani sīgaḍi suṭṭū kammugu vastuṁdī
vĕchchani salimaṁṭagu ā sīgaḍi karigiṁdī
nidduralone kavviṁche kalagannā
nijamĕṁto aṁdaṁgā uṁdī
ŏhŏhŏho ŏhohoho

ammāyi kiḍigī pakkana paḍuguṁdī
kiḍigīloṁcheṁ kanabaḍuduṁdi
gaṁṭagi tŏṁbhai maiḽḽa vegaṁtoḍi
kunugŏchchi vāliboyiṁdi