పల్లవి:
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
చరణం 1:
కోటేరులాంటి ముక్కు.. కోలకళ్ళు..
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
కోటేరులాంటి ముక్కు... కోలకళ్ళు..
.. లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు
..ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో సిరులు ||అబ్బాయే||
చరణం 2:
దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు...
దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
.. తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు..
ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..
ఈ ఆత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్ళు ||అమ్మాయే||
చరణం 3:
నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను
అహా..నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను..
ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?
హ హా..హా..||అమ్మాయే||