Amma todu abba todu.....

అమ్మ తోడు అబ్బ తోడు.....
Year
Language

పల్లవి:

అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు

అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 1:

ఆకలన్నదే లేదు.. హర హరా..రామ రామా
అన్నమే రుచికాదు ...శివ శివా..కృష్ణ కృష్ణా..
ఆకలన్నదే లేదు.. హర హరా...
అన్నమే రుచికాదు... శివ శివా...

వెన్నెలలొస్తె వేడిరా నా దొరా...ఆ వేడిలోనే చలేసింది రా
ఆకలన్నదే నీకు లేకపోతే...ఈ కేకలెందుకే రాకపోకలెందుకే
ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు...నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు

అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 2:

కళ్ళు కాయలు కాచే హర హరా.... ఈశ్వరా
నిన్ను చూడకమాకు శివ శివా.... శ్రీహర
కళ్ళు కాయలు కాచే ...హర హరా
నిన్ను చూడకమాకు ...శివ శివా

పొద్దె గడవదు మాకు ఓ దొరా...నిద్దరన్నదే లేదు రా
నిద్దరన్నదే నీకు లేకపోతే...ఈ పిలుపులెందుకే ..ఆ కులుకులెందుకే
గుట్టు బయట పెట్టకుంటే ...పెద్ద ఒట్టు
గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు...

అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం 3:

ఆ శివుడే వరమిచ్చాడే ...అదిరిపడకే ఆడవి జింకా
అంబ పలికే జగదంబ పలికెనే... ఆశవదులుకో నీవింకా

ఆహాఁ భోలా శంకరుడయినా నిన్ను బొల్తాకొట్టించాడమ్మా
చిత్తైపోయావమ్మో... ఓ సిగ్గులదొరసానమ్మా

తెల్లారే తల్లో పూలు పెట్టుకురమ్మన్నాడు
తేల్లారకనే తలస్నానం చేసి రమ్మన్నాడు
చిటికెడు విబూది ఇచ్చాడు
పిడికెడు నాకు ఇచ్చాడు
అమ్మతోడు అందాల రాముడు... నా వాడన్నాడు
నా అన్నవాడు అడవి రాముడు ...నా తోడన్నాడు
అందుకే వాడు నా వాడు...
కాడు కాడు ...కాలేడు....
అబ్బ అమ్మా...

అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు... ఇంకెన్నటికి నేనే మీ తోడు
అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు... ఇంకెన్నటికి నేనే మీ తోడు
ఇంతటితో ఆపండి... మీగోడు

pallavi:

ammadoḍu...abbadoḍu..nā toḍu...nī toḍu
anniḍigi nuvve nā toḍu...iṁkĕnnaḍigi nene nī toḍu

ammadoḍu...abbadoḍu..nā toḍu...nī toḍu
anniḍigi nuvve nā toḍu...iṁkĕnnaḍigi nene nī toḍu

saraṇaṁ 1:

āgalannade ledu.. hara harā..rāma rāmā
anname rusigādu ...śhiva śhivā..kṛṣhṇa kṛṣhṇā..
āgalannade ledu.. hara harā...
anname rusigādu... śhiva śhivā...

vĕnnĕlalŏstĕ veḍirā nā dŏrā...ā veḍilone salesiṁdi rā
āgalannade nīgu legabode...ī kegalĕṁduge rāgabogalĕṁduge
ŏṭṭimāḍaliṁka nīvu kaṭṭibĕṭṭu...nī ŏṭṭu tīsi gaṭṭumīda aṭṭibĕṭṭu

ammadoḍu...abbadoḍu..nā toḍu...nī toḍu
anniḍigi nuvve nā toḍu...iṁkĕnnaḍigi nene nī toḍu

saraṇaṁ 2:

kaḽḽu kāyalu kāse hara harā.... īśhvarā
ninnu sūḍagamāgu śhiva śhivā.... śhrīhara
kaḽḽu kāyalu kāse ...hara harā
ninnu sūḍagamāgu ...śhiva śhivā

pŏddĕ gaḍavadu māgu o dŏrā...niddarannade ledu rā
niddarannade nīgu legabode...ī pilubulĕṁduge ..ā kulugulĕṁduge
guṭṭu bayaḍa pĕṭṭaguṁṭe ...pĕdda ŏṭṭu
gaṭṭu mīda silaga viṁṭe guṭṭu raṭṭu...

ammadoḍu...abbadoḍu..nā toḍu...nī toḍu
anniḍigi nuvve nā toḍu...iṁkĕnnaḍigi nene nī toḍu

saraṇaṁ 3:

ā śhivuḍe varamichchāḍe ...adiribaḍage āḍavi jiṁkā
aṁba palige jagadaṁba paligĕne... āśhavadulugo nīviṁkā

āhām̐ bholā śhaṁkaruḍayinā ninnu bŏldāgŏṭṭiṁchāḍammā
sittaiboyāvammo... o sigguladŏrasānammā

tĕllāre tallo pūlu pĕṭṭugurammannāḍu
tellāragane talasnānaṁ sesi rammannāḍu
siḍigĕḍu vibūdi ichchāḍu
piḍigĕḍu nāgu ichchāḍu
ammadoḍu aṁdāla rāmuḍu... nā vāḍannāḍu
nā annavāḍu aḍavi rāmuḍu ...nā toḍannāḍu
aṁduge vāḍu nā vāḍu...
kāḍu kāḍu ...kāleḍu....
abba ammā...

amma toḍu abba toḍu nā toḍu nī toḍu
anniḍigi mīre nā toḍu... iṁkĕnnaḍigi nene mī toḍu
amma toḍu abba toḍu nā toḍu nī toḍu
anniḍigi mīre nā toḍu... iṁkĕnnaḍigi nene mī toḍu
iṁtaḍido ābaṁḍi... mīgoḍu