Amdenu nede amdani jaabilli

అందెను నేడే అందని జాబిల్లి
Year
Language

పల్లవి:

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి...

చరణం 1:

ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే ...చెలికాడే నాలో తలపులు రేపెనులే !

చరణం 2:

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే .. నెలరాజే నాతో సరసములాడెనులే !

చరణం 3:

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే..
వినువీధిని నామది విహరించెలే..వలరాజే నాలో వలపులు చిలికెనులే !!!

pallavi:

aṁdĕnu neḍe aṁdani jābilli
nā aṁdālannī ādani vĕnnĕlale
aṁdĕnu neḍe aṁdani jābilli...

saraṇaṁ 1:

inneḽḽagu virisĕ vasaṁtamulu
innāḽḽagu navvĕnu malliyalu
niduriṁchina āśhalu siguriṁchĕle
niduriṁchina āśhalu siguriṁchĕle ...sĕligāḍe nālo talabulu rebĕnule !

saraṇaṁ 2:

nā sĕkkili mĕllaga mīḍagane
naranaramula vīṇalu mroginavi
giligiṁtala nā menu pulagiṁchĕle
giligiṁtala nā menu pulagiṁchĕle .. nĕlarāje nādo sarasamulāḍĕnule !

saraṇaṁ 3:

iga rālavu kannula mutyamulu
iga vāḍavu toḍala kusumamulu
vinuvīdhini nāmadi vihariṁchĕle..
vinuvīdhini nāmadi vihariṁchĕle..valarāje nālo valabulu siligĕnule !!!