Amdamaa alaa alaa

అందమా అలా అలా
Work
Year
Language

పల్లవి:

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా

చరణం 1:

తెల్ల చీర ఇచ్చుకో మల్లెపూల వేళలో
సన్నకాటుకిచ్చుకో సందె చీకటేళలో
కదలి వచ్చే నీలో.. కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే.. కవితలెన్నో రాశా.. ఆహాహా

కొత్త మోజుల.. మత్తు గాలికి.. సొగసు ఊపిరి.. పోసుకున్నది
రాగాలెన్నో నీలో రేగే వేళా...

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా

చరణం 2:

కొమ్మ రెమ్మ సందుల్లో మావిళ్ళ విందులో
కోకిలమ్మ వీధుల్లో రాగాల చిందులు

రామచిలకలు తెచ్చే చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా.. నీకు కానుక చేశా

మండు వేసవి.. మల్లెలావిడి.. పండు వెన్నెల.. పడుచు ఊపిరి..
నీలో నాలో ఊయ్యాలూగే వేళా..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా

pallavi:

aṁdamā alā alā.. allugo ilā ilā
aṁdamā alā alā.. allugo ilā ilā
kavviṁche nī kaḽḽu.. nuvvichche kaugiḽḽu
nūreḽḽu nāvenule.. e e e..

aṁdamā alā alā.. allugo ilā ilā

saraṇaṁ 1:

tĕlla sīra ichchugo mallĕbūla veḽalo
sannagāḍugichchugo saṁdĕ sīgaḍeḽalo
kadali vachche nīlo.. kaḍali pŏṁgulu sūśhā
kanula nīḍalalone.. kavidalĕnno rāśhā.. āhāhā

kŏtta mojula.. mattu gāligi.. sŏgasu ūbiri.. posugunnadi
rāgālĕnno nīlo rege veḽā...

aṁdamā alā alā.. allugo ilā ilā

saraṇaṁ 2:

kŏmma rĕmma saṁdullo māviḽḽa viṁdulo
kogilamma vīdhullo rāgāla siṁdulu

rāmasilagalu tĕchche siguru lekhalu sūśhā
siguru vesina premā.. nīgu kānuga seśhā

maṁḍu vesavi.. mallĕlāviḍi.. paṁḍu vĕnnĕla.. paḍusu ūbiri..
nīlo nālo ūyyālūge veḽā..

aṁdamā alā alā.. allugo ilā ilā
kavviṁche nī kaḽḽu.. nuvvichche kaugiḽḽu
nūreḽḽu nāvenule.. e e e..

aṁdamā alā alā.. allugo ilā ilā