Alaga paanubu ekkanela

అలక పానుపు ఎక్కనేల
Year
Language

పల్లవి:

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా ఆ ఆ ఆ
అలక చాలింక

నాకలకేమిటే నీమొహం ఊరుకో

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా ఆ ఆ ఆ
అలక చాలింక
శీతాకాలం సాయంకాలం....
శీతాకాలం సాయంకాలం....
అటు అలిగిపోయేవేల చలి కొరికి చంపేవేళా

అందుకే లోపలికి పోతానే తల్లీ
నన్నొదులు

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా ఆ ఆ ఆ
అలక చాలింకా

చరణం 1:

రామరామ శబరి బామ్మ నిద్దరే పోదూ

హ్మ్ నువ్విట్టా ఇంత గొంతేసుకుని పాడితే నిద్దరెట్టా పడుతుందే

రాతిరంతా చందమామ నిదర పోనీదు ఊ..
కంటి కబురా పంపలేనూ..
ఇంటి గడపా దాటలేనూ..
ఆ దోర నవ్వూ దాచకే నా నేరమింకా ఎంచకే
ఆ దోర నవ్వూ దాచకే ఈ నవ్వు నవ్వీ చంపకే

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా ఆ ఆ ఆ
అలక చాలింకా

చరణం 2:

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ

ఆ రాతే రాసి ఉంటే ఇంట్లోనే వెచ్చగా నిద్రపోయేదాన్ని కదా

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే మీ నోటి ముత్యం రాలునా

నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా ఆ ఆ ఆ
అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం....
శీతాకాలం సాయంకాలం....
నను చంపకే తల్లీ జోకొట్టకే గిల్లీ

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా ఆ ఆ ఆ
అలక చాలింకా

pallavi:

alaga pānubu ĕkkanela silibi goriṁkā ā ā ā
alaga sāliṁka

nāgalagemiḍe nīmŏhaṁ ūrugo

alaga pānubu ĕkkanela silibi goriṁkā ā ā ā
alaga sāliṁka
śhīdāgālaṁ sāyaṁkālaṁ....
śhīdāgālaṁ sāyaṁkālaṁ....
aḍu aligiboyevela sali kŏrigi saṁpeveḽā

aṁduge lobaligi podāne tallī
nannŏdulu

alaga pānubu ĕkkanela silibi goriṁkā ā ā ā
alaga sāliṁkā

saraṇaṁ 1:

rāmarāma śhabari bāmma niddare podū

hm nuvviṭṭā iṁta gŏṁtesuguni pāḍide niddarĕṭṭā paḍuduṁde

rādiraṁtā saṁdamāma nidara ponīdu ū..
kaṁṭi kaburā paṁpalenū..
iṁṭi gaḍabā dāḍalenū..
ā dora navvū dāsage nā neramiṁkā ĕṁchage
ā dora navvū dāsage ī navvu navvī saṁpage

alaga pānubu ĕkkanela silibi goriṁkā ā ā ā
alaga sāliṁkā

saraṇaṁ 2:

rāsi unna nŏsaḍi gīda sĕrabanelerū
rāyani ā nudiḍirāda rāyanūlerū

ā rāde rāsi uṁṭe iṁṭlone vĕchchagā nidraboyedānni kadā

rāsi unna nŏsaḍi gīda sĕrabanelerū
rāyani ā nudiḍirāda rāyanūlerū
nachchinā maharāju nīvū...
nachchide maharāṇi nenū...
ā māḍa edo tĕlibide mī noḍi mutyaṁ rālunā

nulagabānubu nalli bādha pilla silagammā ā ā ā
allarābammā...
śhīdāgālaṁ sāyaṁkālaṁ....
śhīdāgālaṁ sāyaṁkālaṁ....
nanu saṁpage tallī jogŏṭṭage gillī

alaga pānubu ĕkkanela silibi goriṁkā ā ā ā
alaga sāliṁkā