పల్లవి:
అదిగదిగో .. ఆశలు రేపుతూ ..ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదుగో .. కలలను చూపుతూ.. ఎదలను ఏలే ఏవో వైనాలు
ఎగిరొచ్చే ఆ గువ్వలా ..చిగురించే ఈ నవ్వులా.. సాగే సావాసం
ప్రతి హృదయం లో ఆ కల ..నిజమైతే ఆపేదెలా.. పొంగే ఆనందం
కలైనా ..ఇదో కధైనా ...రచించే ఏవో రాగాలే
ఈ సమయం ఏ తలపులలో ..తన గురుతుగ విడిచెళుతుందో
ఈ మనసుకు జత ఏదంటే ..తను ఏమని బదులిస్తుందో
చరణం 1:
వరమనుకో ..దొరికిన జీవితం ..రుతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో ..తన గమ్యాన్నే చేరునో ..చూపే దారేదీ
వరించే ..ప్రతి క్షణాన్ని ..జయించే స్నేహం తోడవనీ
తన గూటిని వెతికే కళ్ళు.. గమనించవు ఎద లోగిళ్ళు
తల వాల్చిన మలి సంధ్యల్లో ..సెలవడిగెను తొలి సందళ్ళు
pallavi:
adigadigo .. āśhalu rebudū ..ĕdurugā vāle ĕnno varṇālu
idigidugo .. kalalanu sūbudū.. ĕdalanu ele evo vainālu
ĕgirŏchche ā guvvalā ..siguriṁche ī navvulā.. sāge sāvāsaṁ
pradi hṛdayaṁ lo ā kala ..nijamaide ābedĕlā.. pŏṁge ānaṁdaṁ
kalainā ..ido kadhainā ...rasiṁche evo rāgāle
ī samayaṁ e talabulalo ..tana guruduga viḍisĕḽuduṁdo
ī manasugu jada edaṁṭe ..tanu emani badulistuṁdo
saraṇaṁ 1:
varamanugo ..dŏrigina jīvidaṁ ..ruduvulu gīse raṁgula o sitraṁ
ī payanaṁ e malubulo ..tana gamyānne seruno ..sūbe dāredī
variṁche ..pradi kṣhaṇānni ..jayiṁche snehaṁ toḍavanī
tana gūḍini vĕdige kaḽḽu.. gamaniṁchavu ĕda logiḽḽu
tala vālsina mali saṁdhyallo ..sĕlavaḍigĕnu tŏli saṁdaḽḽu