Adi oga idile

అది ఒక ఇదిలే
Year
Language

పల్లవి:

అది ఒక ఇదిలే... అతనికే తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే
అహ! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లా లా...లా..లా..||2||

చరణం 1:

మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూ
అహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను
అని పలికిందిరా చెలి కులికింది రా
ఎద రగిలిందిరా మతి చెదిరింది రా... చెదిరింది రా

అది ఒక ఇదిలే ఆమెకే తగులే
అరి కొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
అహ! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే

చరణం 2:

సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ
అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు
మది పులకించెను మరులొలికించెనూ
నను మరిపించెను తగుననిపించెను

చరణం 3:

నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
నా వద్దున్నదే తన ముద్దన్నదీ
చే కొమ్మంది నీ సొమ్మన్నదీ..... సొమ్మన్నదీ

ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగానూ
అహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయానూ
ఇది బాధందునా ఇది హాయందునా
ఏది ఏమయిననూ నేను తనదాననూ...
తనదాననూ..

pallavi:

adi ŏga idile... adanige tagule
sari kŏtta sarasālu saradālu savisūsĕle
aha! ĕnaleni sukhamĕlla tanadoḍidanibiṁchĕle
lā lā...lā..lā..||2||

saraṇaṁ 1:

mĕchchānu vachchānu ememo tĕchchānū
aha nachchānu annāvā emaina istānu
ani paligiṁdirā sĕli kuligiṁdi rā
ĕda ragiliṁdirā madi sĕdiriṁdi rā... sĕdiriṁdi rā

adi ŏga idile āmĕge tagule
ari kŏtta sarasālu saradālu savisūbĕle
aha! ĕnaleni sukhamĕlla tanadoḍidanibiṁchĕle

saraṇaṁ 2:

siggela annāḍu nā bugga gillāḍu
siggela annāḍu nā bugga gillāḍū
aha mŏggallĕ unnāvu virabūyamannāḍu
madi pulagiṁchĕnu marulŏligiṁchĕnū
nanu maribiṁchĕnu tagunanibiṁchĕnu

saraṇaṁ 3:

naḍagedi annānu naḍisiṁdi ŏgasāri
aha naḍumedi annānu navviṁdi vayyāri
nā vaddunnade tana muddannadī
se kŏmmaṁdi nī sŏmmannadī..... sŏmmannadī

ĕṁḍalle vachchāḍu maṁchalle karigānū
ahā vĕnnĕllu kuriśhāḍu veḍĕkkiboyānū
idi bādhaṁdunā idi hāyaṁdunā
edi emayinanū nenu tanadānanū...
tanadānanū..