Abhinava shashirekhavo

అభినవ శశిరేఖవో
Year
Language

పల్లవి:

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో ||2||
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో

నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

చరణం 1:

ఆ కనులు ఇంద్ర నీలాలుగా ఈ తనువు చంద్ర శిఖరాలుగా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే

ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో అభినవ శశిరేఖవో

చరణం 2:

నా వయసు వలపు హరివిల్లుగా నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా

నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా

pallavi:

abhinava śhaśhirekhavo priyadama śhubhalekhavo ||2||
ā tŏli sūbu kiraṇāla nĕlavaṁka nīvo

navayuva kavirājuvo priyadama nĕlarājuvo
nā kanudoyi kamalāla bhramarammu nīvo
navayuva kavirājuvo priyadama nĕlarājuvo

saraṇaṁ 1:

ā kanulu iṁdra nīlālugā ī tanuvu saṁdra śhikharālugā kadalāḍu kalyāṇive
nā hṛdayaṁ madhura saṁgīdamai kalyāṇa vīṇa svaragīdamai śhrudi seyu jadagāḍive

ā jadalona vĕdalanni sallārsave
navayuva kavirājuvo abhinava śhaśhirekhavo

saraṇaṁ 2:

nā vayasu valabu harivillugā navabārijādāla pŏdarillugā rāvoyi raviśhekharā
tŏli saṁdhya madhura maṁdārame nī nudiḍi tilaga siṁgāramai nūreḽḽu vĕligiṁchanā

nā nūreḽḽa nĕlavaḽḽu karigiṁchanā