Abba deeni sogu

అబ్బ దీని సోకు
Year
Language

పల్లవి:

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు

చరణం 1:

దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మచీకట్లే సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే
ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు

చరణం 2:

ఎన్ని బాణాలు వేస్తావు నీవు తీపిగాయలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో కంటికే నోరు మూసెయ్యనా
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డులేని నావా చలాకి ప్రేమా సందు చూసి పాడే సరాగమే
బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే ముందుగానె దోపిడైతె టాటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు

pallavi:

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu
amma dīni sūbu marumallĕ tūbu
amma rāgu rāgu nenunnavaibu
le gulābi mŏggalāḍi ĕrrabuggalaṁṭugunna muddulanni modabuṭṭe
siggu paḍḍa pĕdavi mīda mŏgga vichchugunna pūlu mojulanni mālalalle

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu
amma dīni sūbu marumallĕ tūbu
amma rāgu rāgu nenunnavaibu

saraṇaṁ 1:

dora aṁdālu sūśhāga nenu dosugoguṁṭĕ āgedĕlā
kŏmma vaṁgāga kŏṁgŏtta paṁḍu dāsinā nenu dāgedĕlā
saṁdĕbŏddiṁka sannagillāga sinnagā gillugonā
simmasīgaṭle siggubaḍḍāga ninnu nenallugonā
ŏḍḍuleni eru ŏḍela bhāmā aḍḍuleni premā idenule
muddubĕṭṭagānĕ muḽḽujāriboye
vĕlluvaṁṭi īḍu mīda ŏḽḽu ŏḽḽu vaṁtĕnesi sāḍu sūsi dāḍuduṁṭe taṁṭā

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu
amma dīni sūbu marumallĕ tūbu
amma rāgu rāgu nenunnavaibu
le gulābi mŏggalāḍi ĕrrabuggalaṁṭugunna muddulanni modabuṭṭe
siggu paḍḍa pĕdavi mīda mŏgga vichchugunna pūlu mojulanni mālalalle

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu

saraṇaṁ 2:

ĕnni bāṇālu vestāvu nīvu tībigāyalado sĕppanā
ĕnni koṇālu unnāyi nīlo kaṁṭige noru mūsĕyyanā
ĕṁta tuḽḽiṁta leda ŏḽḽaṁtā kaugile kappugonā
mĕchchugunnaṁta ichchugunnaṁta mĕttagā puchchugonā
tĕḍḍuleni nāvā salāgi premā saṁdu sūsi pāḍe sarāgame
bŏṭṭu pĕṭṭagāne gaṭṭu jāriboye
vĕnnĕlaṁṭi sogulanni īlavesi ivvabode muṁdugānĕ dobiḍaidĕ ṭāḍā

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu
amma dīni sūbu marumallĕ tūbu
amma rāgu rāgu nenunnavaibu
le gulābi mŏggalāḍi ĕrrabuggalaṁṭugunna muddulanni modabuṭṭe
siggu paḍḍa pĕdavi mīda mŏgga vichchugunna pūlu mojulanni mālalalle

abba dīni sogu saṁpaṁgi regu
aṁṭuguṁṭĕ ṣhāgu nannaṁṭugogu
amma dīni sūbu marumallĕ tūbu
amma rāgu rāgu nenunnavaibu