Title (Indic)చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా WorkAaramj Year2011 LanguageTelugu Credits Role Artist Music Vanamaali Performer Kaardeek LyricsTeluguపల్లవి: చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా... వేస్తావే.. వల నీతో వేగేదెలా ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా చరణం 1: నిన్నే ఇలా... చేరగా... మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుందలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీసంకెలా కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం చరణం 2: ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమనుంచి వేరై పోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా Englishpallavi: silibigā sūstāvalā pĕnavestāvilā ninne ābedĕlā sivarigi nuvve alā... vestāve.. vala nīdo vegedĕlā o premā.. kannullo vāle roju ĕṁto bāguṁdanī kala kŏnnāḽḽe.. aṁdaṁgā ūristoṁdi ābai sedĕkkudoṁdilā kaḍadāga premiṁche dāredo polsedĕlā silibigā sūstāvalā pĕnavestāvilā ninne ābedĕlā sivarigi nuvve alā vestāve vala nīdo vegedĕlā saraṇaṁ 1: ninne ilā... seragā... māḍe mārsi māye sĕyyālā nanne iga nannugā premiṁchani premelā ūbire āgedāgā edo ŏga toḍuṁdalā nanniṁtagā ūriṁchestū allestoṁde nīsaṁkĕlā kŏṁchaṁ madhuramu kŏṁchaṁ virahamu iṁtalo nuvvu naragaṁ kŏṁchaṁ svargamu kŏṁchaṁ śhāṁtamu gŏṁtulo sālu garaḽaṁ kŏṁchaṁ paruvamu kŏṁchaṁ praḽayamu guṁḍĕne koyu gāyaṁ kŏṁchaṁ maunamu kŏṁchaṁ gānamu ĕṁdugī iṁdrajālaṁ saraṇaṁ 2: innāḽḽugā sāginā premanuṁchi verai podunnā maḽḽī maro guṁḍĕdo snehaṁ kori vĕḽudunnā premane dāhaṁ tīrse sāyaṁ kosaṁ vesānilā ŏkko kṣhaṇaṁ ā saṁtoṣhaṁ nādo pāḍu sāgedĕlā ĕlā silibigā sūstāvalā pĕnavestāvilā ninne ābedĕlā sivarigi nuvve alā vestāve vala nīdo vegedĕlā o premā.. kannullo vāle roju ĕṁto bāguṁdanī kala kŏnnāḽḽe.. aṁdaṁgā ūristoṁdi ābai sedĕkkudoṁdilā kaḍadāga premiṁche dāredo polsedĕlā