Aanaadi aa snehamaanamdageedam..

ఆనాటి ఆ స్నేహమానందగీతం..
Work
Year
Language

పల్లవి:

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆఙ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆహాయి లేదే నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా...ఆ.ఆ
హ హ హ... లేదురా సుఖం రాదురా ఆ గతం
ఏవిటో జీవితం...అర్రె ఫూల్ గుర్తుందిరా..
గోడలు దూకిన రోజులు..మొకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకొని..

ఒరే..ఒరే ఈడియట్..
పక్కనే పెళ్లి కావలసిన పిల్లలున్నార్రా..

నేర్చుకుంటారా..ఆ..ఆ

హ హ హ హ హ హ హ

చరణం 1:

నేను మారలేదూ నీవు మారలేదూ
కాలం మారిపోతే నేరం మనదేమి కాదూ
ఈ నేల ఆ నింగి ఆలాగే వున్నా
ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో
నెమరేసుకుందాము ఆరోజులు
భ్రమలాగ ఉంటాయి ఆ లీలలు
ఆ మనసులుఆ మమతలు ఏమాయెరా

వచనం: ఒరే రాస్కెల్.. ఙ్ఞాపకం ఉందిరా..
కాలేజిలో క్లాస్ రూములో ఓపాపమీద
నీవు ఓ పేపర్ బాల్ తో కొడితే..
ఆ పాప ఎడమ కాలి చెప్పు...

ఒరే..ఒరే స్కౌండ్రల్..
ఊరుకోరా పిల్లలు వింటారు..

వింటే వింటార్రా..పిల్లల పిల్లలకు
పిట్టకథలుగా చెప్పుకుంటారు..అంతే..ఆ..

హ హ హ హ హ హ !!ఆనాటి!!

చరణం 2:

మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిచ్చై మండినాను
నాగుండె మంటింక ఆరేది కాదు
నేనుండి తనువెళ్లి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా రేయ్!
పసిపాపలే లేని ఇల్లాయిరా
ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా..ఆ..

ఒరే..ఒరేయి ఎమిట్రా పసిపిల్లలాగ..ఆ
చీచీ ఊరుకో

ఒరేయి ఈ కన్నీళ్లకు తుది ఎక్కడరా..?

కర్చీఫ్ తో తుడ్చేయడమేరా..ఆ..ఆ..

హ హ హహహహహ....

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆఙ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
హ హ హ హ రియల్లీ దోస్ డేస్ ఫ్యాబులెస్.
.ఆ కరెక్ట్రారా
హా హా హా..ల లా లా...

pallavi:

ānāḍi ā snehamānaṁdagīdaṁ
āṅñābagālannī madhurādimadhuraṁ
īnāḍu āhāyi lede nestaṁ
ārojulu munumuṁdiga rāvemirā...ā.ā
ha ha ha... ledurā sukhaṁ rādurā ā gadaṁ
eviḍo jīvidaṁ...arrĕ phūl gurduṁdirā..
goḍalu dūgina rojulu..mŏgāligi tagilina dĕbbalu
sīgaṭlo pillanugŏni..

ŏre..ŏre īḍiyaṭ..
pakkane pĕḽli kāvalasina pillalunnārrā..

nersuguṁṭārā..ā..ā

ha ha ha ha ha ha ha

saraṇaṁ 1:

nenu māraledū nīvu māraledū
kālaṁ māribode neraṁ manademi kādū
ī nela ā niṁgi ālāge vunnā
ī gāli mostuṁdi mana gāthalĕnno
nĕmaresuguṁdāmu ārojulu
bhramalāga uṁṭāyi ā līlalu
ā manasuluā mamadalu emāyĕrā

vasanaṁ: ŏre rāskĕl.. ṅñābagaṁ uṁdirā..
kālejilo klās rūmulo obābamīda
nīvu o pebar bāl to kŏḍide..
ā pāba ĕḍama kāli sĕppu...

ŏre..ŏre skauṁḍral..
ūrugorā pillalu viṁṭāru..

viṁṭe viṁṭārrā..pillala pillalagu
piṭṭagathalugā sĕppuguṁṭāru..aṁte..ā..

ha ha ha ha ha ha !!ānāḍi!!

saraṇaṁ 2:

manase ichchinānu maraṇaṁ tĕchchinānu
sidilo sūsinānu sichchai maṁḍinānu
nāguṁḍĕ maṁṭiṁka āredi kādu
nenuṁḍi tanuvĕḽli bradugiṁka ledu
tana śhābame nāgu tagiliṁdirā rey!
pasibābale leni illāyirā
ī kannula kannīḍigi tudiyedirā..ā..

ŏre..ŏreyi ĕmiṭrā pasibillalāga..ā
sīsī ūrugo

ŏreyi ī kannīḽlagu tudi ĕkkaḍarā..?

karsīph to tuḍcheyaḍamerā..ā..ā..

ha ha hahahahaha....

ānāḍi ā snehamānaṁdagīdaṁ
āṅñābagālannī madhurādimadhuraṁ
ha ha ha ha riyallī dos ḍes phyābulĕs.
.ā karĕkṭrārā
hā hā hā..la lā lā...