Aagulo aagunai poovulo poovunai

ఆకులో ఆకునై పూవులో పూవునై
Year
Language

పల్లవి:

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

చరణం 1:

గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై||2||

జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

చరణం 2:

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల||2||

చదులెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

pallavi:

āgulo āgunai pūvulo pūvunai
kŏmmalo kŏmmanai nunu ledarĕmmanai
ī aḍavi dāgibonā ĕḍulainā isaḍane āgibonā

saraṇaṁ 1:

galagala nī vīsu sirugālilo kĕraḍamai||2||

jalajala nī pāru sĕla pāḍalo teḍanai
pagaḍāla sigurāgu tĕrasāḍu seḍinai
paruvaṁpu viḍiseḍe sinnāri siggunai
ī aḍavi dāgibonā ĕḍulainā isaḍane āgibonā

saraṇaṁ 2:

tarulĕkki ĕlanīli girinĕkki mĕlamĕlla||2||

sadulĕkki jaladaṁpu nīlaṁpu niggunai
āgalā dāhamā siṁtalā vaṁtalā
ī taralīvĕrrinai egadamā tirugāḍā
ī aḍavi dāgibonā ĕḍulainā isaḍane āgibonā