Aagu saadu pimde tadise ..

ఆకు చాటు పిందె తడిసే ..
Work
Year
Language

పల్లవి:

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే

ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెత్తింది

చరణం 1:

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే .. అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే .. అహ అహ .. అహ అహ

ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే !!

నీ మాట విని మబ్బు మెరిసి ..
అహ జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి !!
అ, అః , అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..

చరణం 2:

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే .. అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే .. అహ అహ .. అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే !!

అహ .. నీ పాట విని మెరుపులొచ్చి
అహ .. నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి !!
అ, అః , అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..

pallavi:

āgu sāḍu piṁdĕ taḍise .. koga māḍu pilla taḍise
āgu sāḍu piṁdĕ taḍise .. koga māḍu pilla taḍise

āgāśha gaṁgŏchchiṁdi .. aṁdālu muṁchĕttiṁdi
godāri pŏṁgŏchchiṁdī .. kŏṁgulni muḍibĕṭṭiṁdi

gūḍu sāḍu guvva taḍise .. guṁḍĕ māḍu guṭṭu taḍise
gūḍu sāḍu guvva taḍise .. guṁḍĕ māḍu guṭṭu taḍise

āgāśha gaṁgŏchchiṁdi.. aṁdālu muṁchĕttiṁdi
godāri pŏṁgŏchchiṁdi .. kŏṁgulni muḍibĕttiṁdi

saraṇaṁ 1:

muddichchi o sinugu mutyamai poduṁṭe .. aha aha.. ahā aha
sigurāgu pādāla sirimuvvalauduṁṭe .. aha aha .. aha aha

o sinugu ninu tāgi taḍi āri poduṁṭe ..
o sinugu ninu tāgi taḍi āri poduṁṭe ..
o sinugu nī mĕḍalo naga lāga navuduṁṭe !!

nī māḍa vini mabbu mĕrisi ..
aha jaḍivānale kurisi kurisi ..
vaḽḽu taḍisi ..vĕlli virisi...
valabu sarigaṁga snānālu sĕyyāli !!
a, aḥ , aha aha āha aha.. aha āha ..

saraṇaṁ 2:

maimarasi o mĕrubu ninnalluguṁṭuṁṭe .. aha aha .. aha aha
ĕdalona o mĕrubu pŏdarillu kaḍuduṁṭe .. aha aha .. ahā aha aha

o mĕrubu nī sūbai urimesi rammaṁṭe..
o mĕrubu nī navvai nanne namilestuṁṭe !!

aha .. nī pāḍa vini mĕrubulŏchchi
aha .. nī virubule muḍubu lichchi
salini pĕṁchi .. sĕlimi paṁchi
tanalo vĕchchaṁgā taḍi ārsugovāli !!
a, aḥ , aha aha āha aha.. aha āha ..