Aagalumdadu daahamumdadu

ఆకలుండదు దాహముండదు
Year
Language

పల్లవి:

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటె
వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటె
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటె....

చరణం 1:

మల్లెలుండవు వెన్నెలుండవు నీ నవ్వే లేకుంటే
మనసు వుండదు మమత వుండదు నీ మనిషిని కాకుంటే
మల్లెలుండవు వెన్నెలుండవు నీ నవ్వే లేకుంటే
మనసు వుండదు మమత వుండదు నీ మనిషిని కాకుంటే

వయసుతో ఈ పోరువుండదు నీ వలపే లేకుంటే...
వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే..
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

చరణం 2:

పొద్దు గడిచేపోతుంది నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది నీ చూపు పడుతుంటే...
పొద్దు గడిచేపోతుంది నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది నీ చూపు పడుతుంటే...

ఆకు మడుపులు అందిస్తూ నువ్వు వగలుపోతుంటే...
ఎంత ఎరుపో.. అంత వలపని నేనాశపడుతుంటే...
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

చరణం 3:

తేనెకన్న తీపికలదని నీ పెదవే తెలిపింది
దానికన్న తీయనైనది నీ ఎదలో దాగుంది..
తేనెకన్న తీపికలదని నీ పెదవే తెలిపింది
దానికన్న తీయనైనది నీ ఎదలో దాగుంది

మొదటిరేయికి తుదేలేదని నీ బుగ్గే కొసరింది
పొద్దు చాలని ముద్దులన్నీ నీ వద్దే దాచింది
...ఆ ముద్రే మిగిలింది..

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటే
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

pallavi:

āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭe
vere āśha vuṁḍadu dhyāsa vuṁḍadu nuvvu toḍuṁṭe

āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭĕ
vere āśha vuṁḍadu dhyāsa vuṁḍadu nuvvu toḍuṁṭĕ
āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭĕ....

saraṇaṁ 1:

mallĕluṁḍavu vĕnnĕluṁḍavu nī navve leguṁṭe
manasu vuṁḍadu mamada vuṁḍadu nī maniṣhini kāguṁṭe
mallĕluṁḍavu vĕnnĕluṁḍavu nī navve leguṁṭe
manasu vuṁḍadu mamada vuṁḍadu nī maniṣhini kāguṁṭe

vayasudo ī poruvuṁḍadu nī valabe leguṁṭe...
valabu iṁta vĕchchaguṁḍadu nī ŏḍilo kāguṁṭe..
āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭe

saraṇaṁ 2:

pŏddu gaḍiseboduṁdi nī naḍaga sūstuṁṭe
ā naḍaga taḍabaḍiboduṁdi nī sūbu paḍuduṁṭe...
pŏddu gaḍiseboduṁdi nī naḍaga sūstuṁṭe
ā naḍaga taḍabaḍiboduṁdi nī sūbu paḍuduṁṭe...

āgu maḍubulu aṁdistū nuvvu vagaluboduṁṭe...
ĕṁta ĕrubo.. aṁta valabani nenāśhabaḍuduṁṭe...
āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭe

saraṇaṁ 3:

tenĕganna tībigaladani nī pĕdave tĕlibiṁdi
dāniganna tīyanainadi nī ĕdalo dāguṁdi..
tenĕganna tībigaladani nī pĕdave tĕlibiṁdi
dāniganna tīyanainadi nī ĕdalo dāguṁdi

mŏdaḍireyigi tudeledani nī bugge kŏsariṁdi
pŏddu sālani muddulannī nī vadde dāsiṁdi
...ā mudre migiliṁdi..

āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭe
vere āśha vuṁḍadu dhyāsa vuṁḍadu nuvvu toḍuṁṭe
āgaluṁḍadu dāhamuṁḍadu ninnu sūstuṁṭe