Aagaashamaa neevekkada, avani painunna nenek&

ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్&
Year
Language

పల్లవి:

ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా... ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా, నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా

చరణం 1:

నీలాల గగనాల ఓ జాబిలి, నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి, నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?

ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?

నీ మనసన్నది నా మది విన్నది, నిలిచి పోయింది ఒక ప్రశ్నలా

నిలిచి పోయింది ఒక ప్రశ్నలా

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ, అది నిలిచి ఉంది నీపక్కన

వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ

ఆకాశమా లేదక్కడ, అది నిలిచి ఉంది నీపక్కన

చరణం 2:

వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై

వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై

మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున

సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన

వేల తారకలు తనలో వున్నా, వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ

pallavi:

āgāśhamā nīvĕkkaḍa, avani painunna nenĕkkaḍā
āgāśhamā nīvĕkkaḍa, avani painunna nenĕkkaḍā

e rĕkkalado ĕgisi vachchinā... e rĕkkalado ĕgisi vachchinā, niluvagalana nībakkana

āgāśhamā nīvĕkkaḍa, avani painunna nenĕkkaḍā

saraṇaṁ 1:

nīlāla gaganāla o jābili, ninu nirubeda muṁgiḍa nilibedĕlā?
nīlāla gaganāla o jābili, ninu nirubeda muṁgiḍa nilibedĕlā?

muḽḽunna rālunna nā dārilo nī sallani pādālu sāgedĕlā?

nī manasannadi nā madi vinnadi, nilisi poyiṁdi ŏga praśhnalā

nilisi poyiṁdi ŏga praśhnalā

āgāśhamā... ledakkaḍa ...
āgāśhamā ledakkaḍa, adi nilisi uṁdi nībakkana

vela tāragalu tanalo vunnā.. vela tāragalu tanalo vunnā nelabaine tana makkuva

āgāśhamā ledakkaḍa, adi nilisi uṁdi nībakkana

saraṇaṁ 2:

vĕlaleni nī manasu kovĕlalo nanu tala dāsugoni siru vĕlugunai
vĕlaleni nī manasu kovĕlalo nanu tala dāsugoni siru vĕlugunai

vĕnu tirigi sūḍani nī naḍagalo nannu kaḍadāga rāni nī aḍugunai

mana sahajīvanaṁ vĕligiṁchāli nī samada kāṁtulu pradi dikkuna

samada kāṁtulu pradi dikkuna

āgāśhamā nīvĕkkaḍa.. adi nilisi vuṁdi nābakkana

vela tāragalu tanalo vunnā, vela tāragalu tanalo vunnā nelabaine tana makkuva
ī nelabaine tana makkuva