పల్లవి:
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం
దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చేయందించీ
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్ని రప్పించి
మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
చరణం 1:
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
చరణం 2:
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక
దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
pallavi:
āgāśhaṁ tāgelā vaḍa gālai ī nela aṁdiṁche āhvānaṁ premaṁṭe
ārāḍaṁ tīrelā badulichche gaganaṁ lā vinibiṁche taḍi gānaṁ premaṁṭe
aṇuvaṇuvunu mīḍe mamadala maunaṁ pada pada maṁṭe nilavadu prāṇaṁ
ā paluge praṇayānigi śhrīgāraṁ
dāhaṁ lo munigina sigurugu sallani tana seyaṁdiṁchī
snehaṁ to mŏlagĕttiṁche sinuge premaṁṭe
meghaṁ lo niddura poyina raṁgulu anni rappiṁchi
māghāṇi muṁgiḍa pĕṭṭe mugge premaṁṭe
saraṇaṁ 1:
prāṇaṁ ĕbuḍu mŏdalaiṁdo tĕlubagala tedi edo gurdiṁcheṁdugu vīluṁdā
praṇayaṁ ĕvari hṛdayaṁlo ĕbuḍu udayistuṁdo gamaniṁche samayaṁ uṁṭuṁdā
premaṁṭe emaṁṭe sĕppese māḍuṁṭe ā māḍa ki tĕlisenā premaṁṭe
adi saridalu saidaṁ sadavani vainaṁ kavidalu saidaṁ palagani bhāvaṁ
sarigamalĕrugani madhurima premaṁṭe
daridāḍi uragalu vese e nadigainā tĕlisiṁdā tanalo ī ŏravaḍi pĕṁchina tŏli sinugedaṁṭe
siri pairai ĕgire varagu senugu mātraṁ tĕlisiṁdā tanalo kanibiṁche kaḽalagu tŏli pilubedaṁṭe
saraṇaṁ 2:
maṁḍe kŏliminaḍagaṁde tĕliyade mannu kādu idi svarṇamaṁṭu sūbālaṁṭe
paṁḍe pŏlamu sĕbuduṁde padunugā nāḍe nāgali poḍe sesina melaṁṭe
tanuvaṁtā virabūse gāyāle varamālai darisere priyurāle gĕlubaṁṭe
tanu kŏluvaivuṁḍe viluve vuṁṭe alāṁṭi manasugu tanaṁtā tānai aḍagaga
dŏrige varame valabaṁṭe
janmaṁtā nī aḍugullo aḍugulu kalibe jada vuṁṭe naḍagallo taḍabāḍainā nāṭyaṁ ayibodā
reyaṁtā nī talabulado ĕrrabaḍe kannulu vuṁṭe ā kāṁte nuvvĕdige saṁkrāṁtai ĕduravadā