Aagaasham digivachchi mabbulado veyaali

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి
Year
Language

పల్లవి:

ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వేయాలి మన పందిరి
ఊరంత చెప్పుకునె ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి

చెరిసగమవమని.. మనసులు కలుపుతు..
తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని.. వరసలు కలుపుతు..
మురిసిన బంధుజనం

మాఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలె
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వేయాలి మన పందిరి

చరణం 1:

చెంపలొ విరబూసే అమ్మాయి సిగ్గుదొంతరలు
ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ఓ.. ఓ..
వానవిల్లె వధువుగ మారి ఒదిగిన వేడుకలో

తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల
కులుకల కలువకు కానుకగా...
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా..

ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వెయ్యాలి మన పందిరి
ఊరంత చెప్పుకునె ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి

చరణం 2:

విన్న వారెవరసలు సన్నాయి వారి సంగతులు
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు.. ఊ.. ఊ.
పందిరంతా ఘుమ ఘుమలాడె.. విందు సువాసనలు

తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ
ఇదిగిదిగో అని చూపెడుతు
తెగ తిరిగె తరుణుల తికమక పరుగులు చూడగా..

ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వెయ్యాలి మన పందిరి
ఊరంత చెప్పుకునె ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరిసగమవమని.. మనసులు కలుపుతు..
తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని.. వరసలు కలుపుతు..
మురిసిన బంధుజనం

మాఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వేయాలి మన పందిరి

pallavi:

āgāśhaṁ digi vachchi mabbuludo veyāli mana paṁdiri
ūraṁta sĕppugunĕ muchchaḍagā jaragāli pĕḽlaṁṭe mari

sĕrisagamavamani.. manasulu kalubudu..
tĕra tĕrisina taruṇaṁ
idi varagĕragani.. varasalu kalubudu..
murisina baṁdhujanaṁ

māiḽḽa leda māviḽḽa toraṇālanni pĕḽli śhubhalekhalĕ
akṣhiṁtalesi āśhīrvadiṁchamanu pilubulainavi gālule

āgāśhaṁ digi vachchi mabbuludo veyāli mana paṁdiri

saraṇaṁ 1:

sĕṁpalŏ virabūse ammāyi siggudŏṁtaralu
ā sŏṁpulagu ĕravese abbāyi sūbu tŏṁdaralu
e varālo ī javarālai jadabaḍu samayaṁlo o.. o..
vānavillĕ vadhuvuga māri ŏdigina veḍugalo

tana sarasana virisina sirisiri sŏgasula
kulugala kaluvagu kānugagā...
ĕda sarasuna ĕgasina alajaḍi alale tāgagā..

āgāśhaṁ digi vachchi mabbuludo vĕyyāli mana paṁdiri
ūraṁta sĕppugunĕ muchchaḍagā jaragāli pĕḽlaṁṭe mari

saraṇaṁ 2:

vinna vārĕvarasalu sannāyi vāri saṁgadulu
sanna sannagā rusarusalu viyyālavāri visavisalu
saṁdu sūsi saga saga āḍe jūda śhikhāmaṇulu.. ū.. ū.
paṁdiraṁtā ghuma ghumalāḍĕ.. viṁdu suvāsanalu

tama niganiga nagalanu paduguri ĕduruga
idigidigo ani sūbĕḍudu
tĕga tirigĕ taruṇula tigamaga parugulu sūḍagā..

āgāśhaṁ digi vachchi mabbuludo vĕyyāli mana paṁdiri
ūraṁta sĕppugunĕ muchchaḍagā jaragāli pĕḽḽaṁṭe mari

sĕrisagamavamani.. manasulu kalubudu..
tĕra tĕrisina taruṇaṁ
idi varagĕragani.. varasalu kalubudu..
murisina baṁdhujanaṁ

māiḽḽa leda māviḽḽa toraṇālanni pĕḽli śhubhalekhale
akṣhiṁtalesi āśhīrvadiṁchamanu pilubulainavi gālule

āgāśhaṁ digi vachchi mabbuludo veyāli mana paṁdiri