Aagaashadeshaanaa aashaadamaasaanaa

ఆకాశదేశానా ఆషాడమాసానా
Year
Language

పల్లవి:

ఆకాశదేశానా ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

చరణం 1:

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ||2||
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా విరహ వేదనా

చరణం 2:

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై (2)
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

pallavi:

āgāśhadeśhānā āṣhāḍamāsānā
mĕriseḍi o meghamā..mĕriseḍi o meghamā
virahamo dāhamo viḍaleni mohamo
vinibiṁchu nā sĕligi meghasaṁdeśhaṁ meghasaṁdeśhaṁ

saraṇaṁ 1:

vānagāru koyilanai tĕllavāri vĕnnĕlanai ||2||
ī ĕḍāri dārulalo ĕḍada nenu parisānani kaḍimivolĕ nilisānani
uramani taramani ūsulado ulibiri sinugula bāsalado
vinnaviṁchu nā sĕligi vinna vedanā viraha vedanā

saraṇaṁ 2:

rālubūla teniyagai rādibūla tummĕdanai (2)
ī niśhīdhi nīḍalalo nivurulāga migilānani śhidhila jīvinaināni
tŏlagari mĕrubula lekhalado rudhira bhāspajala dhāralado
vinnaviṁchu nā sĕligi manovedanā nā maraṇayādanā