Aagaasha veedhilo amdaala taaravo

ఆకాశ వీధిలో అందాల తారవో
Work
Year
Language

పల్లవి:

ఊఁ... ఊఁ... ఆ... ఆ... ఆ...
ఆకాశ వీధిలో అందాల తారవో
ఆవేశ గీతిలో పలికే సితారవో
నీలి నీలి కన్నుల్లోని ఊసులేమిటో
లేత లేత పెదవుల్లోని ఆశలేమిటో
చక్కని చుక్కకు సిగ్గులెందుకో
ఆకాశ వీధిలో అందాల తారవో

చరణం 1:

ఆమె ఊపిరి పూల సుగంధం
ఆమె చూపే సూర్యుడి కిరణం
సొగసే సంగీతమూ... మనసే సౌంధర్యమూ
విసిరిందే తొలి చూపు... హోయ్... విరహంలో చలి తూపు
అది తగిలిందిలే... ఎద రగిలిందిలే
మది పలికిందిలే... పదమయ్యిందిలే
తారా తారా తానాలాడే సంధ్యారాగంలో || ఆకాశ వీధిలో ||

చరణం 2:

ఆమె నడకే నెమలికి నాట్యం
ఆమె పలుకే కవులకు వాక్యం
మెరిసే చిరు కోపమూ... రూపానికే అందమూ
తొలకరి పూతల నవ్వు... తొడిమే ఎరగని పువ్వు
అది తెలిపిందిలే... కథ తెలిసిందిలే
శృతి కలిసిందిలే... జత కుదిరిందిలే
దిక్కు దిక్కు ముద్దాడి నా ఊహాగానంలో || ఆకాశ వీధిలో ||

pallavi:

ūm̐... ūm̐... ā... ā... ā...
āgāśha vīdhilo aṁdāla tāravo
āveśha gīdilo palige sidāravo
nīli nīli kannulloni ūsulemiḍo
leda leda pĕdavulloni āśhalemiḍo
sakkani sukkagu siggulĕṁdugo
āgāśha vīdhilo aṁdāla tāravo

saraṇaṁ 1:

āmĕ ūbiri pūla sugaṁdhaṁ
āmĕ sūbe sūryuḍi kiraṇaṁ
sŏgase saṁgīdamū... manase sauṁdharyamū
visiriṁde tŏli sūbu... hoy... virahaṁlo sali tūbu
adi tagiliṁdile... ĕda ragiliṁdile
madi paligiṁdile... padamayyiṁdile
tārā tārā tānālāḍe saṁdhyārāgaṁlo || āgāśha vīdhilo ||

saraṇaṁ 2:

āmĕ naḍage nĕmaligi nāṭyaṁ
āmĕ paluge kavulagu vākyaṁ
mĕrise siru kobamū... rūbānige aṁdamū
tŏlagari pūdala navvu... tŏḍime ĕragani puvvu
adi tĕlibiṁdile... katha tĕlisiṁdile
śhṛti kalisiṁdile... jada kudiriṁdile
dikku dikku muddāḍi nā ūhāgānaṁlo || āgāśha vīdhilo ||