Aadimchi ashta semmaa odimchaavammaa

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
Year
Language

పల్లవి:

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

చరణం 1:

ఓ ఓ .......ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను ...వేశాక కన్ను... వెనెక్కేలాగ తీసుకొను
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వోద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో నిలేసే గళ్ళ బాటలొ
నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా..
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడటం అంతే...

చరణం 2:

ఓ ఓ.......
నా నేరం ఏముందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవ్వంటీ రూపం నాజూగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటీ కోపం వొళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీ లేవీ అంత కొత్తేం కాదమ్మా...

pallavi:

āḍiṁchi aṣhṭa sĕmmā oḍiṁchāvammā
nī paṁṭa paṁḍiṁde premā
nijaṁgā nĕggaḍaṁ aṁṭe iṣhṭaṁgā oḍaḍaṁ aṁte
ā māḍe aṁṭe ī sinnārī nammadeṁṭammā
nijaṁgā nĕggaḍaṁ aṁṭe iṣhṭaṁgā oḍaḍaṁ aṁte

āḍiṁchi aṣhṭa sĕmmā oḍiṁchāvammā
nī paṁṭa paṁḍiṁde premā
nijaṁgā nĕggaḍaṁ aṁṭe iṣhṭaṁgā oḍaḍaṁ aṁte
ā māḍe aṁṭe ī sinnārī nammadeṁṭammā
nijaṁgā nĕggaḍaṁ aṁṭe iṣhṭaṁgā oḍaḍaṁ aṁte

saraṇaṁ 1:

o o .......ūraṁtā muṁchestū haṁgāmā sestāveṁṭe gaṁgammā
ghoraṁgā niṁdistū ī paṁtālĕṁdugu sālle maṁgammā
sūśhāga ninnu ...veśhāga kannu... vĕnĕkkelāga tīsugŏnu
eṁ sĕppugonu ĕḍu tappugonu nuvvoddannā nenŏppugonu
nuvvese gavvalāḍalo nilese gaḽḽa bāḍalŏ
nī dāgā nannu rappiṁchchiṁdi nuvve levammā..
nijaṁgā nĕggaḍaṁ aṁṭe iṣhṭaṁgā oḍaḍaṁ aṁte...

saraṇaṁ 2:

o o.......
nā neraṁ emuṁde eṁ sĕppiṁdo nī tallo jejĕmmā
maṁdāraṁ ayyiṁdi ā roṣhaṁ tāgi jaḽḽo jājammā
pūvvaṁṭī rūbaṁ nājūggā gillī kĕvvaṁdi guṁḍĕ ninna dāgā
muḽḽaṁṭī kobaṁ vŏḽḽaṁtā allī navviṁdi neḍu āgalega
manniste tappeṁ ledammā marī ī māraṁ mānammā
ī lāvādevī levī aṁta kŏtteṁ kādammā...