Aade paade vayassu maadi

ఆడే పాడే వయస్సు మాది
Year
Language

పల్లవి:

ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది
ఆకాశం మా హద్దు ఆదర్శాలే ముద్దు
అంతా ఒకటై ఉంటే అడ్డే మాకిక లేదు
నదురు బెదురు ఎదురే లేదంతే

నమస్తే ఈ ప్రేమకు నమస్తే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే
ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది

చరణం 1:

ఒక్కటైతే చాలురా ఓటమింక లేదురా
ఏకధాటి యాత్రలో ఎదురు లేదురా
బ్రహ్మరాత మార్చరా రుద్రుడల్లె మారరా
నింగిలోన సూర్యుడు నిద్రపోడురా
నలుగురు కలిసిన నవ్వే బలం
నడుములు వంచిన శ్రమే ఫలం
నలుగురు కలిసిన నవ్వే బలం
నడుములు వంచిన శ్రమే ఫలం
జనమూ మనమూ కలిసే జగమంటే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే

ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది

చరణం 2:

నమస్తే ఈ ప్రేమకు నమస్తే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే

ఋతువులెన్ని మారినా మతులు మారనీకురా
మనసు కన్న లేదురా కలిమి సోదరా
నీకు దిక్కు నేనురా నాకు దివ్వె నీవురా
నీవు తోడు నేను నీడై సాగుదామురా
చిరిగె నిరాశల నీ రాతిరి
వెలిగె ఉగాదిగ నీ ఊపిరి
చిరిగె నిరాశల నీ రాతిరి
వెలిగె ఉగాదిగ నీ ఊపిరి
మనసూ మమత కలిసే మనిషంటే

నమస్తే ఈ ప్రేమకు నమస్తే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే

ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది
ఆకాశం మా హద్దు ఆదర్శాలే ముద్దు
అంతా ఒకటై ఉంటే అడ్డే మాకిక లేదు
నదురు బెదురు ఎదురే లేదంతే

నమస్తే ఈ ప్రేమకు నమస్తే
నమస్తే ఈ ప్రేమకు నమస్తే

pallavi:

āḍe pāḍe vayassu mādi addaṁ lāṁṭi manassu mādi
āgāśhaṁ mā haddu ādarśhāle muddu
aṁtā ŏgaḍai uṁṭe aḍḍe māgiga ledu
naduru bĕduru ĕdure ledaṁte

namaste ī premagu namaste
namaste ī premagu namaste
āḍe pāḍe vayassu mādi addaṁ lāṁṭi manassu mādi

saraṇaṁ 1:

ŏkkaḍaide sālurā oḍamiṁka ledurā
egadhāḍi yātralo ĕduru ledurā
brahmarāda mārsarā rudruḍallĕ mārarā
niṁgilona sūryuḍu nidraboḍurā
naluguru kalisina navve balaṁ
naḍumulu vaṁchina śhrame phalaṁ
naluguru kalisina navve balaṁ
naḍumulu vaṁchina śhrame phalaṁ
janamū manamū kalise jagamaṁṭe
namaste ī premagu namaste
namaste ī premagu namaste

āḍe pāḍe vayassu mādi addaṁ lāṁṭi manassu mādi

saraṇaṁ 2:

namaste ī premagu namaste
namaste ī premagu namaste

ṛtuvulĕnni mārinā madulu māranīgurā
manasu kanna ledurā kalimi sodarā
nīgu dikku nenurā nāgu divvĕ nīvurā
nīvu toḍu nenu nīḍai sāgudāmurā
sirigĕ nirāśhala nī rādiri
vĕligĕ ugādiga nī ūbiri
sirigĕ nirāśhala nī rādiri
vĕligĕ ugādiga nī ūbiri
manasū mamada kalise maniṣhaṁṭe

namaste ī premagu namaste
namaste ī premagu namaste

āḍe pāḍe vayassu mādi addaṁ lāṁṭi manassu mādi
āgāśhaṁ mā haddu ādarśhāle muddu
aṁtā ŏgaḍai uṁṭe aḍḍe māgiga ledu
naduru bĕduru ĕdure ledaṁte

namaste ī premagu namaste
namaste ī premagu namaste