పల్లవి:
ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...
చరణం 1:
పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
చరణం 2:
కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో
pallavi:
ā pūlaraṁgu nī sīra sĕṁgu.. rāśhāyi nālo gīdālu evo
ne pāḍuguṁṭānule rāgāla logiḽḽalo anurāgāla vāgiḽḽalo
o tenĕ dŏṁga nā sāmiraṁga ..puṭṭānu nīgai pūsānu pūvai
nī vĕṁṭa uṁṭānule .. nī dānanaudānule .. mari nīloni gīdānnile...
sari sari garigabada...sari sari garigabada...
saraṇaṁ 1:
pusubuga virisina pūvulu.. talabai kurisĕnu paligĕnu .. uṁḍālanī pachchagā... hoy
ĕrraga virisina pūvulu..ĕdabai kurisĕnu paligĕnu uṁḍālanī premado...
ā raṁgudoḍi ī raṁgu kalise .. nīgāḽḽabārāṇigā ..
nā kaḽḽalo rāṇigā... nā kaḽḽalo rāṇigā...
o tenĕ dŏṁga nā sāmiraṁga ..puṭṭānu nīgai ..pūsānu pūvai
ne pāḍuguṁṭānule rāgāla logiḽḽalo anurāgāla vāgiḽḽalo
saraṇaṁ 2:
kalisina kanulage tĕliyunu ..valabula malubula sŏgasulu..e premabaṁdhālivo.
naḍisina aḍugule kalubunu..manusunu manasunu ŏgaḍigāerāgabaṁdhālivo...hoy
ā baṁdhamedo anubaṁdhamedo pāḍāli bhūbālamai...
aṁdānige mūlamai .. aṁdānige mūlamai
ā pūlaraṁgu nī sīra sĕṁgu rāśhāyi nālo gīdālu evo
ne pāḍuguṁṭānulehoyrāgāla logiḽlalo anurāgāla vāgiḽḽalo