పల్లవి:
ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్
టూ బాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావ్
ఓ గాడ్ మిలియన్ డాలర్ల సిలబస్ ఇచ్చావ్
టూ బ్యాడ్ మిల్లీ గ్రాం బ్రెయినే ఇచ్చావ్
ఓ గాడ్ ఒన్ డే మ్యాచే ఇచ్చావ్
టూ బ్యాడ్ సేం డే ఎక్జాం ఇచ్చావ్
ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్లు గా ఇచ్చావ్
టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్ల గా ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాల్ ఇచ్చావ్
తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేంసేంటి మాతో నీకే
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయ్ల్యూర్ కే
ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...
ఊహ్ ఎలా ఎలా ఎలా...
చరణం 1:
మెమరీ కార్డ్ సైజేమో చోటి
మెమరీ స్టేటస్ కోటి
మిల్లీగ్రాం బ్రెయినైతే ఏంటీ
మిరకిల్స్ చెయ్ దాంతోటి
బాత్రూంలో పాటలకి బదులు
ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం
స్వాతీ బుక్కే చూడూ
అబ్బబ్బ ఎం చెప్పేడ్రా
అహో బాలూ ఒహో బాలూ
అంకెలు మొత్తం వందలు వేలు
విడవని చోటే మొదలు
అహో బాలూ ఒహో బాలూ
ఎ టు జెడ్ అని చదివే బదులు
బి టు యు అంటే చాలు
చరణం 2:
బల్బ్ ని కనిపెడదాం అనుకున్నామూ
ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నామూ
ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడూ
ఆస్కార్ పని పడదాం అనుకున్నామూ
కాని రెహ్మాన్ దాన్ని ఓడిసి పట్టేసాడు
అట్లీస్ట్ ఫస్ట్ రాంక్ కొడదాం అనుకున్నమూ
కాని బాలుగాడు దాని కోసం పుట్టేసాడు
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి
చదువుకు కనిపెట్టాడా మెడిసిన్
టెలిఫోన్ తో స్టాప్ అని అనుకుంటే
స్టార్ట్ అయ్యి ఉండేదా సెల్ ఫోన్...
ఇంతే చాలు అనుకుంటూ పొతే
ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరి పెట్టుకుంటే
నేటికి లేదు టుమారో...
అబ్బబ్బ ఎం చెప్పేడ్రా...
అహో బాలూ ఒహో బాలూ
బాలు కందని లాజిక్ లన్ని
కావా నవ్వుల పాలు
అహో బాలూ ఒహో బాలూ
అనుకోడెపుడూ ఇంతే చాలు
ఈడి మైండ్ రేసులో గుర్రం కాలు
చరణం 3:
లక్ ఉన్నోళ్ళకి రాంకులు ఇచ్చావ్
నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావ్
అట్లీస్ట్ అమ్మాయిల కి అందాన్నిచ్చావ్
మమ్మల్నేమో నిండా ముంచావ్
బ్రిల్లియంట్ స్టుడెంట్స్ కి ఎ గ్రేడ్ అంటా
యావెరేజి స్టుడెంట్స్ కి బి గ్రేడ్ అంటా
మమ్మల్నేమో డి గ్రేడ్ చేస్తావ్
క్యాస్ట్ లు మతాలు వద్దంటూనే
గ్రేడ్ లతో విడదీస్తుంటావ్
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
హే చెట్టుకి పూత కాయ పండని
మూడు రకలుగా చూస్తాం
పూతై పూసి కాయై కాసి
పండైతేనే విలువిస్తాం
గ్రేడ్ అంటె ఏబిసి బళ్ళో
బ్రైనుని కొలిచే స్టిక్కు
కాంపిటిషన్ లేదంటే రేసులో
గెలుపుకు ఉందా కిక్కూ...
అబ్బబ్బ ఏం చెప్పేడ్రా...
అహో బాలూ ఒహో బాలూ
నెంబర్ వన్ను కి రొటీన్ బాలు
చదువు కి రోటీన్ బాలు
అహో బాలూ ఒహో బాలూ
సెటిలేదైనా సెంటర్ బాలు
క్వశ్చన్ ఏంటైనా ఆన్సర్ బాలు
బాలు చదివిన బుక్ అంతా
వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్స్ అంతా
వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలూ వాడిన పెన్నంటా
ఆయుధ పూజలు చేద్దాం
బాలూ నడిచిన బాటంటా
అందరు ఫాలో అయిపోదాం