యాతమేసి తోడినా ఏరు ఎండదు..
పల్లవి:
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు !!2!!
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా
గాలి ఇసిరికొడితే...ఏ...ఏ...ఏ...
ఆ దీపముండదూ..ఊ...ఊ... ఆ దీపముండదూ...
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
చరణం 1:
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా...ఆ...
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా...ఆ...
కుడితి నీళ్లు పోసినా...ఆ..ఆ...ఆ
అది పాలుకుడుపుతాదీ...ఈ...ఈ...ఈ ఈ...ఈ
కడుపుకోతకోసినా...ఆ...ఆ ఆ...ఆ...
అది మనిషికే జన్మ ఇత్తాదీ... ఈ...
బొడ్డు పేగు తెగిపడ్డా.. రోజు తలుసుకో..
బొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో...
చరణం 2:
అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే..
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే..
మేడ మిద్దెలో ఉన్నా...ఆ..ఆ...ఆ ఆ...ఆ
సెట్టునీడ తొంగున్నా..ఆ....ఆ...ఆ నిదరముదరపడినాకా..ఆ..ఆ..ఆ..
పాడిఒక్కటే..హ హ వల్లెకాడ ఒక్కటే..
కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా..హ..హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా..
pallavi:
yādamesi toḍinā yeru ĕṁḍadū
pŏgili pŏgili eḍsinā pŏṁta niṁḍadu !!2!!
devuḍi guḍilodainā pūri guḍĕsalodainā
gāli isirigŏḍide...e...e...e...
ā dībamuṁḍadū..ū...ū... ā dībamuṁḍadū...
yādamesi toḍinā yeru ĕṁḍadū
pŏgili pŏgili eḍsinā pŏṁta niṁḍadu
saraṇaṁ 1:
palubudāḍu mĕḍagette pāḍi āvurā...ā...
pasubudāḍu muḍulette āḍadāyĕrā...ā...
kuḍidi nīḽlu posinā...ā..ā...ā
adi pāluguḍubudādī...ī...ī...ī ī...ī
kaḍubugodagosinā...ā...ā ā...ā...
adi maniṣhige janma ittādī... ī...
bŏḍḍu pegu tĕgibaḍḍā.. roju talusugo..
bŏḍḍu kādu āḍadane guṇaṁ tĕlusugo...
saraṇaṁ 2:
aṁdarū naḍasŏchchina tova ŏkkaḍe..
sīmunĕtturulu pāre tūmu ŏkkaḍe..
meḍa middĕlo unnā...ā..ā...ā ā...ā
sĕṭṭunīḍa tŏṁgunnā..ā....ā...ā nidaramudarabaḍināgā..ā..ā..ā..
pāḍiŏkkaḍe..ha ha vallĕgāḍa ŏkkaḍe..
kūdunersinolla kulaṁ kogilaṁṭarā..ha..ha
āgalesi arasinoḽlu kāgulaṁṭarā..