Soosidem jinnavugaani suddulu kodigomdalu

చూచితేఁ జిన్నవుగాని సుద్దులు కోటికొండలు
Language

(॥పల్లవి॥)
చూచితేఁ జిన్నవుగాని సుద్దులు కోటికొండలు
యేచి యీచేఁతలు సేయ నెట్టు నేరిచితివే

(॥చూచి॥)
సెలవుల నవ్వుకొంటా చిత్తము గరఁగుకొంటా
చెలియ విభుని నెంత చిమ్మిరేఁచేవే
వలపుల చల్లుకొంటా వావు లడుగుకొంటా
సొలసి సొలసి యెంత చొక్కులఁ బెట్టేవే

(॥చూచి॥)
కన్ను లారుచుకొంటాను కడు నెలఇంచుకొంటా
చన్నుల నొరసి యెంత జంకించేవే
సన్నలు సేసుకొటా సరసము లాడుకొంటా
పన్నుక యీతని కెంత పచ్చి సేసేవే

(॥చూచి॥)
సంగడిఁ గూచుండుకొంటా సమ్మతులు సేసుకొంటా
అంగజ రతుల కెంత ఆస చూపేవే
చెంగట నింతలో నన్ను శ్రీవేంకటేశుఁడు గూడె
యెంగిలిగా నీవూఁ గూడి యెంత లాచేవే

(||pallavi||)
sūsidem̐ jinnavugāni suddulu koḍigŏṁḍalu
yesi yīsem̐talu seya nĕṭṭu nerisidive

(||sūsi||)
sĕlavula navvugŏṁṭā sittamu garam̐gugŏṁṭā
sĕliya vibhuni nĕṁta simmirem̐seve
valabula sallugŏṁṭā vāvu laḍugugŏṁṭā
sŏlasi sŏlasi yĕṁta sŏkkulam̐ bĕṭṭeve

(||sūsi||)
kannu lārusugŏṁṭānu kaḍu nĕla̮iṁchugŏṁṭā
sannula nŏrasi yĕṁta jaṁkiṁcheve
sannalu sesugŏḍā sarasamu lāḍugŏṁṭā
pannuga yīdani kĕṁta pachchi seseve

(||sūsi||)
saṁgaḍim̐ gūsuṁḍugŏṁṭā sammadulu sesugŏṁṭā
aṁgaja radula kĕṁta āsa sūbeve
sĕṁgaḍa niṁtalo nannu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yĕṁgiligā nīvūm̐ gūḍi yĕṁta lāseve