చూడఁ జూడ వేడుకలు సుదతి విలాసాలు
(॥పల్లవి॥)
చూడఁ జూడ వేడుకలు సుదతి విలాసాలు
మేడెపు రతి భావాలు మెచ్చఁగదవయ్యా
(॥చూడఁ॥)
వలపులు వెదవెట్టె వనిత నీమీఁదను
మొలచి తమకములు మోసుకలెత్తెను
యెలిమిఁ దలపోఁతలు యెన్ను వెళ్లె నంతలో
చెలఁగి నీ మహిమలు చిత్తగించవయ్యా
(॥చూడఁ॥)
కువ్వలు వోసె వయసు కోమలి చన్నుల నీపై
నవ్వులు గాదెలునిండె నానాటికి
వువ్విళ్లూరి సరసము లొకటికినుమడాయ
చివ్వన నీ మహిమలు చిత్తగించవయ్యా
(॥చూడఁ॥)
పొందికలు దూరపెతై పొలఁతి నీ కాఁగిటను
విందుసేసె మోవితేనె విభవానను
యిందరిలో శ్రీవేంకటేశ యీకె నేలితివి
చెందిననీ మహిమలు చిత్తగించవయ్యా
(||pallavi||)
sūḍam̐ jūḍa veḍugalu sudadi vilāsālu
meḍĕbu radi bhāvālu mĕchcham̐gadavayyā
(||sūḍam̐||)
valabulu vĕdavĕṭṭĕ vanida nīmīm̐danu
mŏlasi tamagamulu mosugalĕttĕnu
yĕlimim̐ dalabom̐talu yĕnnu vĕḽlĕ naṁtalo
sĕlam̐gi nī mahimalu sittagiṁchavayyā
(||sūḍam̐||)
kuvvalu vosĕ vayasu komali sannula nībai
navvulu gādĕluniṁḍĕ nānāḍigi
vuvviḽlūri sarasamu lŏgaḍiginumaḍāya
sivvana nī mahimalu sittagiṁchavayyā
(||sūḍam̐||)
pŏṁdigalu dūrabĕdai pŏlam̐ti nī kām̐giḍanu
viṁdusesĕ movidenĕ vibhavānanu
yiṁdarilo śhrīveṁkaḍeśha yīgĕ nelidivi
sĕṁdinanī mahimalu sittagiṁchavayyā