Sittamu vachchinattallaam jeyaraadaa neevimka

చిత్తము వచ్చినట్టల్లాఁ జేయరాదా నీవిఁక
Language

(॥పల్లవి॥)
చిత్తము వచ్చినట్టల్లాఁ జేయరాదా నీవిఁక
కొత్త కొత్త నేరుపుల కొసరఁగనేఁటికి

(॥చిత్త॥)
వేడుక సింగారాలు వెలవెట్టవచ్చునా
పాడిపంతాలు చేతులఁ బట్టవచ్చునా
చూడఁజూడ చూపులకు సుంకము గొనవచ్చునా
ఆడనేల జాణతనా లాపెతోడ నీవు

(॥చిత్త॥)
వుప్పతిల్లుఁ దరితీపు లుట్టిఁబెట్టవచ్చునా
కప్పరపునవ్వు మోపు గట్టవచ్చునా
చెప్పరాని మాఁటలకు చెవు లొగ్గవచ్చునా
యిప్ప డిట్టె వొట్టువెట్టనేల చెలిని

(॥చిత్త॥)
పానుపుపై చేఁతలు బాయిట వేయవచ్చునా
తేనె మోవిలంకె వెడతెగవచ్చునా
పూని శ్రీవేంకటేశుఁడు పొలఁతి నేలితి విట్టె
వూని సన్నసేయనేల వొనగూడెఁ బనులు

(||pallavi||)
sittamu vachchinaṭṭallām̐ jeyarādā nīvim̐ka
kŏtta kŏtta nerubula kŏsaram̐ganem̐ṭigi

(||sitta||)
veḍuga siṁgārālu vĕlavĕṭṭavachchunā
pāḍibaṁtālu sedulam̐ baṭṭavachchunā
sūḍam̐jūḍa sūbulagu suṁkamu gŏnavachchunā
āḍanela jāṇadanā lābĕdoḍa nīvu

(||sitta||)
vuppadillum̐ daridību luṭṭim̐bĕṭṭavachchunā
kapparabunavvu mobu gaṭṭavachchunā
sĕpparāni mām̐ṭalagu sĕvu lŏggavachchunā
yippa ḍiṭṭĕ vŏṭṭuvĕṭṭanela sĕlini

(||sitta||)
pānububai sem̐talu bāyiḍa veyavachchunā
tenĕ movilaṁkĕ vĕḍadĕgavachchunā
pūni śhrīveṁkaḍeśhum̐ḍu pŏlam̐ti nelidi viṭṭĕ
vūni sannaseyanela vŏnagūḍĕm̐ banulu