Sannajaajuloy..haa..kannemojuloy

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
Year
Language

పల్లవి:

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..తళుకు బెళుకు కనవేరా
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే..కలికి చిలుక ఇటు రావే
హాయ్ ...హాయ్...
వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె..వలపు పిలుపు విని పోవే

చరణం 1:

'బానిసగా వచ్చావు..నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు..నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు'

రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతున్నదీ రారా సుందరా

ఒకటున్నది నీలో..ఒడుపున్నది నాలో .. అది వున్నది లేనిది తెలుసుకో !
మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో..అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో..!!!

చరణం 2:

" ఈ ద్వీపానికి దీపానివి నువ్వు .. ఈ లంకకే నెలవంకవి నువ్వు "

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే .. మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది .. వగరుందిలే సెగ రేగిందిలే
వలపున్నది నాలో .. బలమున్నది నీలో .. ఆ పట్టుని ఈ విడుపుని హాయ్..కోరుకో !
సగమున్నది నాలో ... సగమున్నది నీలో .. రెంటిని జంటగా మలచుకో ... !!!

pallavi:

sannajājuloy..hā..kannĕmojuloy
sannajājuloy..hā..kannĕmojuloy
allibilli saṁtalona pilla gāli jādarāye..taḽugu bĕḽugu kanaverā
pālavĕlli puṁta kāḍa paiḍa kŏṁgu jāriboyĕ..paḍusu gŏḍava vinaverā

sannajājuloy..hā..kannĕmojuloy
sannajājuloy..hā..kannĕmojuloy
hā..kannu kannu gīḍuguṁṭĕ sanna sanna maṁṭarege..kaligi siluga iḍu rāve
hāy ...hāy...
vaḽḽu vaḽḽu mīḍuduṁṭe vagalamāri sĕgalu puṭṭĕ..valabu pilubu vini pove

saraṇaṁ 1:

'bānisagā vachchāvu..nanne nī bānisagā sesugunnāvu
magadanaṁ sūbāvu..nālo āḍadanānni nidra lebāvu'

reyi tĕllāri tĕllāri podunnadī rārā nā dŏrā
tīga allāḍi māllāḍi podunnadī rārā suṁdarā

ŏgaḍunnadi nīlo..ŏḍubunnadi nālo .. adi vunnadi lenidi tĕlusugo !
mĕrubunnadi nālo..urumunnadi nīlo..adi nīdani idi nādani hāy..marisibo..!!!

saraṇaṁ 2:

" ī dvībānigi dībānivi nuvvu .. ī laṁkage nĕlavaṁkavi nuvvu "

mallĕ puvvaṁṭi ravvaṁṭi manasunnadile .. magadoḍuṁdile
siṁta siguraṁṭi pŏgaruṁdi .. vagaruṁdile sĕga regiṁdile
valabunnadi nālo .. balamunnadi nīlo .. ā paṭṭuni ī viḍubuni hāy..korugo !
sagamunnadi nālo ... sagamunnadi nīlo .. rĕṁṭini jaṁṭagā malasugo ... !!!