Pemdilaadenani pomkavettinaamdu modalane

పెండిలాడేనని పోఁకవెట్టినాఁడు మొదలనే
Language

(॥పల్లవి॥)
పెండిలాడేనని పోఁకవెట్టినాఁడు మొదలనే
అండనుండి యెచ్చరించరమ్మ సారెఁ జెలులు

(॥పెండి॥)
అంగనకొప్ప చీఁకటి యమాస వెనక నదె
చెంగటికి నెప్పడు వచ్చీనే విభుఁడు
చంగన విరహపువేసవికాల మరె వచ్చె
రంగుగ జాగుసేయక రమ్మనవే యిఁకను

(॥పెండి॥)
నెలఁతమోముకళల నిండుఁ బున్నమ యెదిరె
మెలఁగుచుఁ గాముని నోమేదెపుడే
అలరి నిట్టూరుపుల ఆయిటి విసరఁజొచ్చె
వెలయఁ దనవలపు వెదవెట్టుమనవే

(॥పెండి॥)
సతిపిరుఁదుల రథసప్తమి నేఁడె కలిగె
తతి శ్రీవేంకటేశుఁడు తగిలెఁగదె
రతి కలమేలుమంగ రప్పించెను తను నీకె
మితిమీరఁ గూడె నిట్టె మెప్పించుమనవే

(||pallavi||)
pĕṁḍilāḍenani pom̐kavĕṭṭinām̐ḍu mŏdalane
aṁḍanuṁḍi yĕchchariṁcharamma sārĕm̐ jĕlulu

(||pĕṁḍi||)
aṁganagŏppa sīm̐kaḍi yamāsa vĕnaga nadĕ
sĕṁgaḍigi nĕppaḍu vachchīne vibhum̐ḍu
saṁgana virahabuvesavigāla marĕ vachchĕ
raṁguga jāguseyaga rammanave yim̐kanu

(||pĕṁḍi||)
nĕlam̐tamomugaḽala niṁḍum̐ bunnama yĕdirĕ
mĕlam̐gusum̐ gāmuni nomedĕbuḍe
alari niṭṭūrubula āyiḍi visaram̐jŏchchĕ
vĕlayam̐ danavalabu vĕdavĕṭṭumanave

(||pĕṁḍi||)
sadibirum̐dula rathasaptami nem̐ḍĕ kaligĕ
tadi śhrīveṁkaḍeśhum̐ḍu tagilĕm̐gadĕ
radi kalamelumaṁga rappiṁchĕnu tanu nīgĕ
midimīram̐ gūḍĕ niṭṭĕ mĕppiṁchumanave