Olammo tirunaala gilagaa

ఓలమ్మో తిరుణాల గిలకా
Year
Language

పల్లవి:

సాకి: యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...

పల్లవి: అతడు: ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా..ఆ.ఆ...
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా..ఆ.ఆ.

ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ... చుక్కల్లో పక్కేయనా... !!2!!

ఆమె: గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ...
గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ...
ఓరయ్య తొంద్రయ్య పడకా..పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ !!2!!
ఆ..మూడు ముళ్లెయ్యరా..నూరేళ్ల పడకేయరా..!!2!!

చరణం 1:

అతడు: ఆలమబ్బు బుగ్గల మీద.. మెరెపు మెరిసి ఆడినట్టే..
నీలికొండ గుండెల మీద.. వాన చుక్క జారినట్టే..

ఆమె: వానచుక్క వాగులైయీ... సముద్రాన కలిసినట్టే... !!2!!
రోజువారి మోజులన్నీ....మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా... వడినిండా నేనుండి పోనా !!2!! ....

చరణం 2:

ఆమె: రేతిరంతా నిద్దరకాచి.. కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం... ఆకువక్క యేసినట్టే

అతడు: పడమటేపు పడకేసి... సూరిగాడు దొర్లినట్టే !!2!!
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే...
సంధెల్లో చిందేయనా... పొద్దెల్లే ముద్దెట్టనా... !!2!!

pallavi:

sāgi: yeliyallo..yeliyallo ĕṁdāgā..ā..ā
yālamīdi poyeramma gūḍisilagā...

pallavi: adaḍu: olammo tiruṇāla gilagā
vagalāḍi vayyari mŏlagā..ā.ā...
olammo tiruṇāla gilagā
vagalāḍi vayyari mŏlagā..ā.ā.

ĕnnĕllo iḽleyanā..ā..ā... sukkallo pakkeyanā... !!2!!

āmĕ: goraṁkā goraṁkā tummĕdā..ā..ā
gīrĕkkiboyiṁdi tummĕdā..ā..ā...
goraṁkā goraṁkā tummĕdā..ā..ā
gīrĕkkiboyiṁdi tummĕdā..ā..ā...
orayya tŏṁdrayya paḍagā..pŏddĕlle nāyiṁṭa paḍagā..ā..ā !!2!!
ā..mūḍu muḽlĕyyarā..nūreḽla paḍageyarā..!!2!!

saraṇaṁ 1:

adaḍu: ālamabbu buggala mīda.. mĕrĕbu mĕrisi āḍinaṭṭe..
nīligŏṁḍa guṁḍĕla mīda.. vāna sukka jārinaṭṭe..

āmĕ: vānasukka vāgulaiyī... samudrāna kalisinaṭṭe... !!2!!
rojuvāri mojulannī....mejuvāṇi āḍinaṭṭe
orayya nenāḍugonā... vaḍiniṁḍā nenuṁḍi ponā !!2!! ....

saraṇaṁ 2:

āmĕ: rediraṁtā niddaragāsi.. kaluvabūlu navvinaṭṭe
rebumābu āgāśhaṁ... āguvakka yesinaṭṭe

adaḍu: paḍamaḍebu paḍagesi... sūrigāḍu dŏrlinaṭṭe !!2!!
ūrivaibu talubu tīsi tŏṁgi sūsi navvinaṭṭe...
saṁdhĕllo siṁdeyanā... pŏddĕlle muddĕṭṭanā... !!2!!