Oga todalo oga kommalo oga puvvu poosimdi

ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
Work
Year
Language

పల్లవి:

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని...
అలాగే నవ్వుతూ ఉండాలని
నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు..
ఆశీర్వదించాలి

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది

చరణం 1:

ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో...
దేవుడు చల్లగ చూడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది

చరణం 2:

నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా...
దేవుడు వేరే లేడు కదా
తోటమాలే పువ్వుకి దేవుడుగా
మాలికి పువ్వుకు మధ్యన
అనుబంధం... ఎన్నడూ వాడదుగా

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది

pallavi:

ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi
maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi
alāge navvudū uṁḍālani...
alāge navvudū uṁḍālani
niṁginela.. vāguvaṁka.. sĕṭṭusema.. guvvagūḍu..
āśhīrvadiṁchāli

ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi
maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi

saraṇaṁ 1:

ĕnno raṁgula puvvu.. ĕṁḍa kanne ĕragani puvvu
suṁdaramaina puvvu.. palu suguṇālunna puvvu
e guḍilo aḍugubĕṭṭuno...
devuḍu sallaga sūḍāli
ā puvvugu pūjalu seyāli
devuḍi guṁḍĕla guḍilo... ā puvve.. hāyiga uṁḍāli

ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi

saraṇaṁ 2:

nīrunu posi pĕṁchi.. paṁdiralle nīḍanichchi
ĕṁḍā vānallonā ādariṁche toḍamāli
ā puvvugi toḍu uṁḍagā...
devuḍu vere leḍu kadā
toḍamāle puvvugi devuḍugā
māligi puvvugu madhyana
anubaṁdhaṁ... ĕnnaḍū vāḍadugā

ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi
maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi