Title (Indic)ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము యే యపరాధమో కాని యింతేసి సేసితిని (॥ఏ॥) ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను వేమారుఁ బాపములకు వెరవ నైతిని నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి నేమపు పుణ్యములు మానితి నేను (॥ఏ॥) తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున పగటున దేవతల పంపు సేయను నగుతా నీ నామము నాలికనున్న బీరాన జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని (॥ఏ॥) హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని మత్తుఁడనై అన్యచింత మఱచితిని English(||pallavi||) e yājña ayinam̐ bĕṭṭu yidivo nā durjanamu ye yabarādhamo kāni yiṁtesi sesidini (||e||) āmugŏni nī dāsum̐ḍa naneḍi saligalanu vemārum̐ bābamulagu vĕrava naidini nī maṟum̐gu sŏchchinaṭṭi nijagarvame nammi nemabu puṇyamulu mānidi nenu (||e||) tagili nī mudra mena dhariṁchina sanavuna pagaḍuna devadala paṁpu seyanu nagudā nī nāmamu nāliganunna bīrāna jagadi nitya karmamu jāri pom̐dosidini (||e||) hatti nāgum̐galavu nī vaṁtaryāmi vanusu vuttamobāyamu lĕlla nŏlla naidivi yittala śhrī veṁkaḍeśha yeligavu nī vani mattum̐ḍanai anyasiṁta maṟasidini