Title (Indic)చాలు నాతో నింతేసి జంపులేలా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలు నాతో నింతేసి జంపులేలా ఆలరి నీచేఁత లెవ్వరితోనై నఁ జేయరా (॥చాలు॥) రాకాఁ బోకాఁ నాతో నింతేసి రంతు లేలా నీకు నీకె చుట్టరికములు నెరపేవు నాకు నీకు నేమి వోదు నన్ను నవ్వుతానె యేకమైన మాఁటలనె నన్ను యెలయించేవు (॥చాలు॥) సారె సారె నాతో నింతేసి సట లేలా వూరకె నీవావులు దెలిసి వొరసేవు తారుకాణమాఁటల నిక్కువ దాఁక నాడి మేరమీరి యానలు వెట్టుతా మేకొనేవూ (॥చాలు॥) మెచ్చి మెచ్చి నాతో నింతేసి మేకు లేలా యిచ్చకము సేసి సేసి నన్ను యేలఁ జూచేవు విచ్చలవిడిఁ గూడితి నన్ను శ్రీవెంకటనాథ పచ్చిదేర నన్ను నింకా నొడఁబరచేవూ. English(||pallavi||) sālu nādo niṁtesi jaṁpulelā ālari nīsem̐ta lĕvvaridonai nam̐ jeyarā (||sālu||) rāgām̐ bogām̐ nādo niṁtesi raṁtu lelā nīgu nīgĕ suṭṭarigamulu nĕrabevu nāgu nīgu nemi vodu nannu navvudānĕ yegamaina mām̐ṭalanĕ nannu yĕlayiṁchevu (||sālu||) sārĕ sārĕ nādo niṁtesi saḍa lelā vūragĕ nīvāvulu dĕlisi vŏrasevu tārugāṇamām̐ṭala nikkuva dām̐ka nāḍi meramīri yānalu vĕṭṭudā megŏnevū (||sālu||) mĕchchi mĕchchi nādo niṁtesi megu lelā yichchagamu sesi sesi nannu yelam̐ jūsevu vichchalaviḍim̐ gūḍidi nannu śhrīvĕṁkaḍanātha pachchidera nannu niṁkā nŏḍam̐barasevū.