Title (Indic)సుదతితో నింతేలని చూపి చెప్పరమ్మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సుదతితో నింతేలని చూపి చెప్పరమ్మా ఎదురెదురే చూచీ నెటువంటి వలపో (॥సుదతితో॥) చెక్కుమీది చెయ్యి దీయఁ జెప్పరమ్మా దీని, చిక్కనిగుబ్బలు మూయఁ జెప్పరమ్మా! చిక్కునెఱులు ముడువఁ జెప్పరమ్మా దేహ మెక్కడో త నెఱుఁగదు యెటువంటి వలపో (॥సుదతితో॥) చిత్త మేమిటికి వేఁచీఁ జెప్పరమ్మా యీ చిత్తజుచే నేల నొచ్చీఁ జెప్పరమ్మా! చిత్తణివిద్యలు మానఁ జెప్పరమ్మా శిర సెత్తి యెవ్వరిని జూడఁ డెటువంటివలపో (॥సుదతితో॥) చిదుగాయ సిగ్గు లెల్లాఁ జెప్పరమ్మా వొళ్లు చిదిమి నా నెఱుంగదు చెప్పరమ్మా చెదరెడిఁ దమకము చెప్పరమ్మా యిప్పు డిదె వేంకటేశుఁ గూడె నెటువంటివలపో English(||pallavi||) sudadido niṁtelani sūbi sĕpparammā ĕdurĕdure sūsī nĕḍuvaṁṭi valabo (||sudadido||) sĕkkumīdi sĕyyi dīyam̐ jĕpparammā dīni, sikkanigubbalu mūyam̐ jĕpparammā! sikkunĕṟulu muḍuvam̐ jĕpparammā deha mĕkkaḍo ta nĕṟum̐gadu yĕḍuvaṁṭi valabo (||sudadido||) sitta memiḍigi vem̐sīm̐ jĕpparammā yī sittajuse nela nŏchchīm̐ jĕpparammā! sittaṇividyalu mānam̐ jĕpparammā śhira sĕtti yĕvvarini jūḍam̐ ḍĕḍuvaṁṭivalabo (||sudadido||) sidugāya siggu lĕllām̐ jĕpparammā vŏḽlu sidimi nā nĕṟuṁgadu sĕpparammā sĕdarĕḍim̐ damagamu sĕpparammā yippu ḍidĕ veṁkaḍeśhum̐ gūḍĕ nĕḍuvaṁṭivalabo