Title (Indic)చాటి చెప్పితి మిపుడే సంతమౌటే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాటి చెప్పితి మిపుడే సంతమౌటే మేలు వాటముగఁ జెలిమి మఱవకుమయ్యా యిఁకను (॥చాటి॥) సుదతి కనుచూపులకు సొరిది నొడ్డుకోరాదు అదరు వెన్నెలనవ్వు కడ్డము లేదు తుద బొమ్మజంకెనలు తొలఁగ దొబ్బఁగరాదు ముదురు వలపులు మిగుల ముంచుకొనునపుడు (॥చాటి॥) కొనగోరివాఁడి మరి గురిదప్పుకొనరాదు చెనకుఁ జేఁతుల కోరసేయరాదు మనసు కరఁగింపులకు మరఁగువెట్టఁగరాదు తనివోని కోరికలు తగులుకొనునపుడు (॥చాటి॥) వలుద చనుగుబ్బలకు వడి మాటుకొనరాదు కలయుకాఁగిటికి తెరఁగట్టరాదు యెలమి శ్రీవేంకటేశ ఇపు డీకెఁ గూడితివి కలుగుఁ దమకము లిట్లఁ గరుణించినపుడు English(||pallavi||) sāḍi sĕppidi mibuḍe saṁtamauḍe melu vāḍamugam̐ jĕlimi maṟavagumayyā yim̐kanu (||sāḍi||) sudadi kanusūbulagu sŏridi nŏḍḍugorādu adaru vĕnnĕlanavvu kaḍḍamu ledu tuda bŏmmajaṁkĕnalu tŏlam̐ga dŏbbam̐garādu muduru valabulu migula muṁchugŏnunabuḍu (||sāḍi||) kŏnagorivām̐ḍi mari guridappugŏnarādu sĕnagum̐ jem̐tula koraseyarādu manasu karam̐giṁpulagu maram̐guvĕṭṭam̐garādu tanivoni korigalu tagulugŏnunabuḍu (||sāḍi||) valuda sanugubbalagu vaḍi māḍugŏnarādu kalayugām̐giḍigi tĕram̐gaṭṭarādu yĕlami śhrīveṁkaḍeśha ibu ḍīgĕm̐ gūḍidivi kalugum̐ damagamu liṭlam̐ garuṇiṁchinabuḍu