Title (Indic)నా మోము చూచి చూచి నన్నెమి బుద్దెడిగేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మోము చూచి చూచి నన్నెమి బుద్దెడిగేవు కాముకునకు నీతి యెక్కడనైనాఁ గలదా (॥నామో॥) నెమ్మది నీతో నేను నేరుపుల మాటలాడి వుమ్మడి వుండేఁ గాని వొరయనోప కమ్మటి నీకు నిచ్కపుఁ జేఁతలెల్లాఁ జేసి సమ్మతి మొక్కేఁ గాని సాదించనోప (॥నామో॥) అప్పటప్పటికి నీతో సంకెలకు నవ్వు నవ్వి కొప్పు దువ్వేఁగాని కడుఁ గొసరనోప యెప్పుడు చూచినా నీకు యెవ్వతెనైనాఁ దెచ్చి నెప్పున మెప్పించేఁగాని నీరప మెంచనోప (॥నామో॥) పూడినట్లనే కూడి కొలువులోపన నీచే వీడె మందుకొనేఁగాని వెంగనకోప యీడనే శ్రీవేంకటేశ యేలితివి కడపలో పాడి నెరపేఁగాని పంగించనోప English(||pallavi||) nā momu sūsi sūsi nannĕmi buddĕḍigevu kāmugunagu nīdi yĕkkaḍanainām̐ galadā (||nāmo||) nĕmmadi nīdo nenu nerubula māḍalāḍi vummaḍi vuṁḍem̐ gāni vŏrayanoba kammaḍi nīgu nichkabum̐ jem̐talĕllām̐ jesi sammadi mŏkkem̐ gāni sādiṁchanoba (||nāmo||) appaḍappaḍigi nīdo saṁkĕlagu navvu navvi kŏppu duvvem̐gāni kaḍum̐ gŏsaranoba yĕppuḍu sūsinā nīgu yĕvvadĕnainām̐ dĕchchi nĕppuna mĕppiṁchem̐gāni nīraba mĕṁchanoba (||nāmo||) pūḍinaṭlane kūḍi kŏluvulobana nīse vīḍĕ maṁdugŏnem̐gāni vĕṁganagoba yīḍane śhrīveṁkaḍeśha yelidivi kaḍabalo pāḍi nĕrabem̐gāni paṁgiṁchanoba