Title (Indic)ఎందు నేరుచుకొనెనో యీపె దిక్కు చూడవోయీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎందు నేరుచుకొనెనో యీపె దిక్కు చూడవోయీ సందడిలో నీకు మోవి చవిచూపీని (॥ఎందు॥) వలపులు చల్లుకొంటా వనిత యేమౌనొకాని మలసి సొలసి నీతో మాటలాడీని బలిమిఁ బెనఁగుకొంటా పనిగలదానివలె పిలిచిపిలిచి నీకు బ్రియముచెప్పీని (॥ఎందు॥) యెమ్మెలు నెరపుకొంటా నెందుండి వచ్చెనోకాని చెమ్మఁ జెమ్మటతో నీపైఁ జేయి చాఁచీని బొమ్మలారుచుకొంటాను పొఁదైనచుట్టమువలె పమ్మి వద్దఁగూచుండి పాదాలొత్తిని (॥ఎందు॥) సారెసారె నవ్వుకొంటా చన వెంతగద్దోకాని కూరిమితోఁ గాఁగిటఁ గూడీ నిన్ను యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను చేరి నన్నేలితివి తా సిగ్గుతో మొక్కిని English(||pallavi||) ĕṁdu nerusugŏnĕno yībĕ dikku sūḍavoyī saṁdaḍilo nīgu movi savisūbīni (||ĕṁdu||) valabulu sallugŏṁṭā vanida yemaunŏgāni malasi sŏlasi nīdo māḍalāḍīni balimim̐ bĕnam̐gugŏṁṭā panigaladānivalĕ pilisibilisi nīgu briyamusĕppīni (||ĕṁdu||) yĕmmĕlu nĕrabugŏṁṭā nĕṁduṁḍi vachchĕnogāni sĕmmam̐ jĕmmaḍado nībaim̐ jeyi sām̐sīni bŏmmalārusugŏṁṭānu pŏm̐dainasuṭṭamuvalĕ pammi vaddam̐gūsuṁḍi pādālŏttini (||ĕṁdu||) sārĕsārĕ navvugŏṁṭā sana vĕṁtagaddogāni kūrimidom̐ gām̐giḍam̐ gūḍī ninnu yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu seri nannelidivi tā siggudo mŏkkini