Title (Indic)ఉమ్మడి మీఇద్దరికి నూడిగపుదాన నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉమ్మడి మీఇద్దరికి నూడిగపుదాన నేను నెమ్మది నాపె సమ్మతినే నన్ను మన్నించుమ్మీ(మీ?) (॥ఉమ్మ॥) ఇక్కడికి వచ్చేసుద్ది యెఱుఁగువా నీదేవులు పక్కన నీవాకె నొడఁబఱచితివా వెక్కసాన వెనకను వెంగెములాడదుగదా చక్క విచారించుకొమ్మీ సరుగ మీఁదటెత్తు (॥ఉమ్మ॥) వేడుక నీనాపొందు వినెనా పట్టపురాణి జాడతోడ నందు కిట్టె సమ్మతించెనా ఆడుకొని నిన్నప్పటి నాఱడిఁ బెట్టదుగదా తోడనే తెలుసుకొమ్మీ తొల్లిటిమాట (॥ఉమ్మ॥) సోరిది మనయిద్దరిఁ జూచెనా అలమేల్మంగ సిరుల నిన్ను మెచ్చెనా శ్రీవేంకటేశ ఇరవై నన్నేలినందు కిచ్చగించి వుండుఁగదా అరసి యెంచుకొమ్మీ ఆకెనీసరవులు English(||pallavi||) ummaḍi mīiddarigi nūḍigabudāna nenu nĕmmadi nābĕ sammadine nannu manniṁchummī(mī?) (||umma||) ikkaḍigi vachchesuddi yĕṟum̐guvā nīdevulu pakkana nīvāgĕ nŏḍam̐baṟasidivā vĕkkasāna vĕnaganu vĕṁgĕmulāḍadugadā sakka visāriṁchugŏmmī saruga mīm̐daḍĕttu (||umma||) veḍuga nīnābŏṁdu vinĕnā paṭṭaburāṇi jāḍadoḍa naṁdu kiṭṭĕ sammadiṁchĕnā āḍugŏni ninnappaḍi nāṟaḍim̐ bĕṭṭadugadā toḍane tĕlusugŏmmī tŏlliḍimāḍa (||umma||) soridi manayiddarim̐ jūsĕnā alamelmaṁga sirula ninnu mĕchchĕnā śhrīveṁkaḍeśha iravai nannelinaṁdu kichchagiṁchi vuṁḍum̐gadā arasi yĕṁchugŏmmī āgĕnīsaravulu