Title (Indic)మిక్కిలి విచ్చి చెప్పితే మేడిపంటి బోనమిది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మిక్కిలి విచ్చి చెప్పితే మేడిపంటి బోనమిది తొక్కుమెట్టు సందడెల్ల తోదోపులే కావా (॥మిక్కిలి॥) చాయలకే మాటలాడి చనవులుమెఱసేవు యీయెడఁ దెలుసునే మీకిద్దరికిని నాయ మే మడిగేవే నన్ను నీ వింతటిలోనే మాయదారిసుద్దులెల్ల మఱఁగులేకావా (॥మిక్కిలి॥) గిలిగింతనవ్వు నవ్వి కిందుమీఁదుఁ జూచేవు నిలువుల నున్నవే మీనేరుపులెల్లా మలసి మీసరితలు మాకేమి అప్పగించేరే కొలఁదిలేనివలపు గుమితమే కాదా (॥మిక్కిలి॥) భావపురతిఁ గరఁగి పైఁ జేయివేసేవు వావిరిఁ దేటపడె మీవగలెల్లను శ్రీవేంకటేశుఁడు నీవు సిగ్గు లిందేల పడేరే కూవలై వున్నవి మీగుట్లింతే కావా English(||pallavi||) mikkili vichchi sĕppide meḍibaṁṭi bonamidi tŏkkumĕṭṭu saṁdaḍĕlla todobule kāvā (||mikkili||) sāyalage māḍalāḍi sanavulumĕṟasevu yīyĕḍam̐ dĕlusune mīgiddarigini nāya me maḍigeve nannu nī viṁtaḍilone māyadārisuddulĕlla maṟam̐gulegāvā (||mikkili||) giligiṁtanavvu navvi kiṁdumīm̐dum̐ jūsevu niluvula nunnave mīnerubulĕllā malasi mīsaridalu māgemi appagiṁchere kŏlam̐dilenivalabu gumidame kādā (||mikkili||) bhāvaburadim̐ garam̐gi paim̐ jeyivesevu vāvirim̐ deḍabaḍĕ mīvagalĕllanu śhrīveṁkaḍeśhum̐ḍu nīvu siggu liṁdela paḍere kūvalai vunnavi mīguṭliṁte kāvā