Title (Indic)ఇన్నిటా దేవరవు నిన్నేమీ ననఁజాలను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నిటా దేవరవు నిన్నేమీ ననఁజాలను తన్నుఁదానే వచ్చీ మేలు దండము నీకు (॥ఇన్ని॥) యెక్కడో ఆపెను నన్నునిద్దరి మాట లాడించి తక్కులఁబెట్టకు మిదె దండము నీకు వొక్కరిచేతివిడె మొక్కరిచేతికిచ్చి తక్కువ సేయకు మిఁక దండము నీకు (॥ఇన్ని॥) వొప్పి వొరట్లు వెట్టి వూడిగాలు సేయించుక దప్పి దేరించకు మోవి దండము నీకు కప్పి వొక్క రొక్కరినిఁ గాఁగిలించు కొమ్మని తప్పించుకోకుమిఁక దండము నీకు (॥ఇన్ని॥) యెగసక్కేల కిద్దరి నిరుమేలాఁ బెట్టుకొని తగవులఁ బెట్ట కంత దండము నీకు నిగిడి శ్రీ వేంకటేశ నేఁడు మమ్ము నేలితివి తగులు విడువకిఁక దండము నీకు English(||pallavi||) inniḍā devaravu ninnemī nanam̐jālanu tannum̐dāne vachchī melu daṁḍamu nīgu (||inni||) yĕkkaḍo ābĕnu nannuniddari māḍa lāḍiṁchi takkulam̐bĕṭṭagu midĕ daṁḍamu nīgu vŏkkarisediviḍĕ mŏkkarisedigichchi takkuva seyagu mim̐ka daṁḍamu nīgu (||inni||) vŏppi vŏraṭlu vĕṭṭi vūḍigālu seyiṁchuga dappi deriṁchagu movi daṁḍamu nīgu kappi vŏkka rŏkkarinim̐ gām̐giliṁchu kŏmmani tappiṁchugogumim̐ka daṁḍamu nīgu (||inni||) yĕgasakkela kiddari nirumelām̐ bĕṭṭugŏni tagavulam̐ bĕṭṭa kaṁta daṁḍamu nīgu nigiḍi śhrī veṁkaḍeśha nem̐ḍu mammu nelidivi tagulu viḍuvagim̐ka daṁḍamu nīgu