Title (Indic)వాఁడె వాఁడె వీఁడె వీఁడె వాడలలో మెరసీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడె వాఁడె వీఁడె వీఁడె వాడలలో మెరసీని ఆఁడుల నడుమనెంత అలరీని చూడరే (॥వాఁడే॥) కనకపు రథమెక్కి కప్పురము చల్లీని వనితలమీఁదట శ్రీవల్లభుఁడు వినువీధి మించినట్టి వేంకటాచలముమీఁద నినుపుఁ జందురుఁడు వెన్నెలగాసినట్లు (॥వాఁడే॥) దేవాసనముమీఁదఁ దిరమై పన్నీరు చల్లీ వేవేలు సతులమీఁద విశ్వమూరితి చేవమీరి శేషాద్రిశిఖరము మీఁదను భావింప మేఘము జడివట్టి మించినట్లు (॥వాఁడే॥) పసిఁడిదండెల పీఁటపై నుండి పూవుల వేసీ వెస నలమేల్మంగ శ్రీవేంకటేశుఁడు మిసిమి నంజనగిరిమీఁద వసంతవేళను వెసఁ గల్పవృక్షము విరులిచ్చినట్లు English(||pallavi||) vām̐ḍĕ vām̐ḍĕ vīm̐ḍĕ vīm̐ḍĕ vāḍalalo mĕrasīni ām̐ḍula naḍumanĕṁta alarīni sūḍare (||vām̐ḍe||) kanagabu rathamĕkki kappuramu sallīni vanidalamīm̐daḍa śhrīvallabhum̐ḍu vinuvīdhi miṁchinaṭṭi veṁkaḍāsalamumīm̐da ninubum̐ jaṁdurum̐ḍu vĕnnĕlagāsinaṭlu (||vām̐ḍe||) devāsanamumīm̐dam̐ diramai pannīru sallī vevelu sadulamīm̐da viśhvamūridi sevamīri śheṣhādriśhikharamu mīm̐danu bhāviṁpa meghamu jaḍivaṭṭi miṁchinaṭlu (||vām̐ḍe||) pasim̐ḍidaṁḍĕla pīm̐ṭabai nuṁḍi pūvula vesī vĕsa nalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍu misimi naṁjanagirimīm̐da vasaṁtaveḽanu vĕsam̐ galbavṛkṣhamu virulichchinaṭlu