Title (Indic)తా నదివో నే నిదివో తారుకాణ లైతిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నదివో నే నిదివో తారుకాణ లైతిమి మోనముతోడ నవ్వరే మోవుల నవ్వూ (॥తాన॥) ఆడ నీడ నుండి వచ్చీ అలసి సొలసి మెచ్చీ వేడుకకాని కియ్యవే విడె మిదిగో నీడనుండె అలసీని నిలుచుండె కలసీని పాడితోడనె మొక్కరే పండుగమొక్కు (॥తాన॥) చేయఁగలవెల్లాఁ జేసీ చేరి నాపైఁ జెయి వేసీ పాయపు వాని కియ్యరే బలు కట్నాలు చాయలకె మాటలాడీ సన్నలకె పాట పాడీ దాయముగాఁ జూడరే సంతసపుఁ జూపు (॥తాన॥) కాంతలలోన వెలసీ కాఁగిట నన్నుఁ గలసీ పంతగాని పై జల్లరే బలు సేసలు యింతలో శ్రీవెంకటేశుఁ డితఁడిదె నన్నుఁ గూడె వింతగా విందు చెప్పరే వియ్యపు విందు English(||pallavi||) tā nadivo ne nidivo tārugāṇa laidimi monamudoḍa navvare movula navvū (||tāna||) āḍa nīḍa nuṁḍi vachchī alasi sŏlasi mĕchchī veḍugagāni kiyyave viḍĕ midigo nīḍanuṁḍĕ alasīni nilusuṁḍĕ kalasīni pāḍidoḍanĕ mŏkkare paṁḍugamŏkku (||tāna||) seyam̐galavĕllām̐ jesī seri nābaim̐ jĕyi vesī pāyabu vāni kiyyare balu kaṭnālu sāyalagĕ māḍalāḍī sannalagĕ pāḍa pāḍī dāyamugām̐ jūḍare saṁtasabum̐ jūbu (||tāna||) kāṁtalalona vĕlasī kām̐giḍa nannum̐ galasī paṁtagāni pai jallare balu sesalu yiṁtalo śhrīvĕṁkaḍeśhum̐ ḍidam̐ḍidĕ nannum̐ gūḍĕ viṁtagā viṁdu sĕppare viyyabu viṁdu