Title (Indic)వారివారి భాగ్యము వలపుల కొలఁది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారివారి భాగ్యము వలపుల కొలఁది నేరుపు గలిగితేను నిన్నమాపే రేపూ (॥వారి॥) కనుసన్న నాపె నిన్నుఁ గరఁగించఁ జూచితేను యెనసి అవె(వ?)మ్ములైతే నేమిసేసును వెనుకొని అవియెల్ల విరహవేళల నింతె మన లొక్కటైతె తామరపూజలవును (॥వారి॥) వుదవి చన్నులనొత్తి వూరడించఁ జూచితేను యిమో పిడిగుండ్లయితే నేమిసేసును పవళించి అవి రతిపంతమాడేవేళనింతె కవగూడితేను జక్కవరూపులవును (॥వారి॥) పెదవులెత్తి చెలియ ప్రియము చెప్పఁజూచితే యెదురుగాలములైతే నేమిసేసును కదియనివేళ నింతెకాని శ్రీవెంకటేశుఁడ యిదె కూడితిరి యివె యిఁక తేనెలవును English(||pallavi||) vārivāri bhāgyamu valabula kŏlam̐di nerubu galigidenu ninnamābe rebū (||vāri||) kanusanna nābĕ ninnum̐ garam̐giṁcham̐ jūsidenu yĕnasi avĕ(va?)mmulaide nemisesunu vĕnugŏni aviyĕlla virahaveḽala niṁtĕ mana lŏkkaḍaidĕ tāmarabūjalavunu (||vāri||) vudavi sannulanŏtti vūraḍiṁcham̐ jūsidenu yimo piḍiguṁḍlayide nemisesunu pavaḽiṁchi avi radibaṁtamāḍeveḽaniṁtĕ kavagūḍidenu jakkavarūbulavunu (||vāri||) pĕdavulĕtti sĕliya priyamu sĕppam̐jūside yĕdurugālamulaide nemisesunu kadiyaniveḽa niṁtĕgāni śhrīvĕṁkaḍeśhum̐ḍa yidĕ kūḍidiri yivĕ yim̐ka tenĕlavunu