Title (Indic)దైవమొక్కఁడే సంతత భజనీయుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమొక్కఁడే సంతత భజనీయుఁడు భావము సమబుద్ధిఁ బాయఁగఁ దగదు (॥దైవ॥) హరియే నకలాంతరాత్మకుఁ డటుగాన తిరమై యొకరి నిందింపఁదగదు అరయఁగ లోకములనిత్య మటుగాన మరిగి కొందరిమీఁది మమతయు వలదు (॥దైవ॥) బహుకల్పితములెల్లఁ బ్రకృతిమూలమే కాన గహనపుఁదన వుద్యోగము వలదు సహజవిహారుఁడు సర్వేశ్వరుఁడుగాన వహిఁ దానేవచ్చినవి వలదనఁదగదు (॥దైవ॥) తపములు జపములు దాస్యమూలమె కాన వుపమల సందేహమొగి వలదు యెపుడును శ్రీవేంకటేశ్వరు సేవించి చపలచిత్తమువారి సంగమిఁక వలదు English(||pallavi||) daivamŏkkam̐ḍe saṁtada bhajanīyum̐ḍu bhāvamu samabuddhim̐ bāyam̐gam̐ dagadu (||daiva||) hariye nagalāṁtarātmagum̐ ḍaḍugāna tiramai yŏgari niṁdiṁpam̐dagadu arayam̐ga logamulanitya maḍugāna marigi kŏṁdarimīm̐di mamadayu valadu (||daiva||) bahugalbidamulĕllam̐ brakṛtimūlame kāna gahanabum̐dana vudyogamu valadu sahajavihārum̐ḍu sarveśhvarum̐ḍugāna vahim̐ dānevachchinavi valadanam̐dagadu (||daiva||) tabamulu jabamulu dāsyamūlamĕ kāna vubamala saṁdehamŏgi valadu yĕbuḍunu śhrīveṁkaḍeśhvaru seviṁchi sabalasittamuvāri saṁgamim̐ka valadu