Title (Indic)చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడఁగించు సంకీర్తనం (॥చాలదా॥) సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణఁగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం (॥చాలదా॥) సామజముఁ గాంచినది సంకీర్తనం సామమున కెక్కుడీ సంకీర్తనం సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం (॥చాలదా॥) జముబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి వొడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదులఁ జేయు సంకీర్తనం (॥చాలదా॥) జలజాసనునినోరి సంకీర్తనం చలిగొండసుతదలఁచు సంకీర్తనం చలువ గడు నాలుకకు సంకీర్తనం చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం (॥చాలదా॥) సరవి సంపదలిచ్చు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరుస వేంకటవిభుని సంకీర్తనం సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం English(||pallavi||) sāladā brahmamidi saṁkīrdanaṁ mīgu jālĕlla naḍam̐giṁchu saṁkīrdanaṁ (||sāladā||) saṁtoṣhagaramaina saṁkīrdanaṁ saṁtābamaṇam̐giṁchu saṁkīrdanaṁ jaṁtuvula rakṣhiṁchu saṁkīrdanaṁ saṁtadamum̐ dalasum̐ḍī saṁkīrdanaṁ (||sāladā||) sāmajamum̐ gāṁchinadi saṁkīrdanaṁ sāmamuna kĕkkuḍī saṁkīrdanaṁ sāmīpya miṁdarigi saṁkīrdanaṁ sāmānyamā viṣhṇu saṁkīrdanaṁ (||sāladā||) jamubāri viḍibiṁchu saṁkīrdanaṁ samabuddhi vŏḍamiṁchu saṁkīrdanaṁ jamaḽi saukhyamulichchu saṁkīrdanaṁ śhamadamādulam̐ jeyu saṁkīrdanaṁ (||sāladā||) jalajāsanuninori saṁkīrdanaṁ saligŏṁḍasudadalam̐su saṁkīrdanaṁ saluva gaḍu nālugagu saṁkīrdanaṁ salabaṭṭi talam̐sum̐ḍī saṁkīrdanaṁ (||sāladā||) saravi saṁpadalichchu saṁkīrdanaṁ sarileni didiyabo saṁkīrdanaṁ sarusa veṁkaḍavibhuni saṁkīrdanaṁ sarugananum̐ dalam̐sum̐ḍī saṁkīrdanaṁ