Title (Indic)తానే తెలియవలె తలఁచి దేహి తన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే తెలియవలె తలఁచి దేహి తన్ను మానుపువారలు మరి వేరీ (॥తానే॥) కడలేని భవసాగరము చొచ్చినతన్ను వెడలించువారలు వేరీ కడుబందములచేతఁ గట్టుపడినతన్ను విడిపించువారలు వేరీ (॥తానే॥) కాఁగినినుము వంటికర్మపు తలమోపు - వేఁగు దించేటివారు వేరీ మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ వీఁగఁ దోలేటివారలు వేరీ (॥తానే॥) తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని వెరపు చెప్పెడువారు వేరీ పరివోని దురితకూపములఁ బడకుమని వెరపు చెప్పెడివారు వేరీ English(||pallavi||) tāne tĕliyavalĕ talam̐si dehi tannu mānubuvāralu mari verī (||tāne||) kaḍaleni bhavasāgaramu sŏchchinadannu vĕḍaliṁchuvāralu verī kaḍubaṁdamulasedam̐ gaṭṭubaḍinadannu viḍibiṁchuvāralu verī (||tāne||) kām̐gininumu vaṁṭigarmabu talamobu - vem̐gu diṁcheḍivāru verī mūm̐gina mohabumūm̐kalu tŏḍim̐baḍa vīm̐gam̐ doleḍivāralu verī (||tāne||) tiruveṁkaḍāsalādhibunim̐ gŏlubumani vĕrabu sĕppĕḍuvāru verī parivoni duridagūbamulam̐ baḍagumani vĕrabu sĕppĕḍivāru verī