Nebamulu vesi vatti neraalela yemchere

నెపములు వేసి వట్టి నేరాలేల యెంచేరే
Language

(॥పల్లవి॥)
నెపములు వేసి వట్టి నేరాలేల యెంచేరే
వుపమల మీరెంత వుప్పతించేరే

(॥నెప॥)
చలిమి బలిమిగల సతులకుఁ బతితోను
చలపట్టి నవ్వఁదగు సాదించఁదగు
కలికితనాల మీకుఁ గాతాళించ నేమిటికి
అలరి సవతులైతే నౌదురుగాక

(॥నెప॥)
ననిచియుండిన యట్టి నాతికి నీతనితోను
పెనఁగితే నెగ్గుగాదు బీరమూఁగాదు
మునుకొన్న సన్నలను మోములు చూచుకొనేవే
అనవలసితే మీరూ నందురగాక

(॥నెప॥)
సేసవెట్టి పెండ్లాడిన చెలికి శ్రీవేంకటేశుఁ
బోసరించి కూడవచ్చుఁ బొగడవచ్చు
వాసినింతులతో మీరు వరుసల దిగేరేమే
ఆసగలిగితే మీరూ నంటుదురుగాక

(||pallavi||)
nĕbamulu vesi vaṭṭi nerālela yĕṁchere
vubamala mīrĕṁta vuppadiṁchere

(||nĕba||)
salimi balimigala sadulagum̐ badidonu
salabaṭṭi navvam̐dagu sādiṁcham̐dagu
kaligidanāla mīgum̐ gādāḽiṁcha nemiḍigi
alari savadulaide naudurugāga

(||nĕba||)
nanisiyuṁḍina yaṭṭi nādigi nīdanidonu
pĕnam̐gide nĕggugādu bīramūm̐gādu
munugŏnna sannalanu momulu sūsugŏneve
anavalaside mīrū naṁduragāga

(||nĕba||)
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕligi śhrīveṁkaḍeśhum̐
bosariṁchi kūḍavachchum̐ bŏgaḍavachchu
vāsiniṁtulado mīru varusala digereme
āsagaligide mīrū naṁṭudurugāga